iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

  • Published Jul 10, 2023 | 10:07 AMUpdated Jul 10, 2023 | 10:07 AM
  • Published Jul 10, 2023 | 10:07 AMUpdated Jul 10, 2023 | 10:07 AM
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

ప్రస్తుత కాలంలో పెట్టుబడి పెట్టాలంటే.. బంగారమే సరైన ఆప్షన్‌ అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. గత ఐదారేళ్లలోనే బంగారం ధర సుమారు 25-30 వేల రూపాయల వరకు పెరిగింది. ఇక భవిష్యత్తులో కూడా బంగారం ధర పైపైకి ఎగబాకుతుంది కానీ.. మరి తులం మీద భారీగా దిగి వచ్చే అవకాశాలు మాత్రం లేవు అంటున్నారు. ఇప్పటికే 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర ఆల్‌ టైమ్‌ గరిష్టానికి అనగా ఏకంగా 60 వేల రూపాయలకు చేరుకుంది. అలానే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర కూడా 55 వేల రూపాయలకు చేరుకుంది. అయితే ఈ మధ్య కాలంలో పసిడి రేటు క్రమంగా పతనమవుతోంది. దాంతో బంగారం కొనాలనుకువారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. గత కొంత కాలంగా బంగారం ధర కొన్ని రోజుల పాటు పెరగడం.. లేదంటే తగ్గడం చేస్తోంది. ఇక జూలై నెల ప్రారంభం నుంచి పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది.. తగ్గిందా, పెరిగిందా అంటే..

పసిడి ధర నేడు స్థిరంగా ఉండటం గమనించవచ్చు. ఆదివారం బంగారం ధర పెరగ్గా.. నేడు మాత్రం నిన్నటి ధరే కొనసాగింది. ఇక సోమవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత ఉంది అంటే.. నేడు భాగ్యనగరంలో పసిడి రేటు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 54,550 రూపాయలు ఉండగా.. స్వచ్ఛమైన మేలిమి బంగారం 24 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు 59,510 రూపాయలుగా ఉంది. క్రితం సెషన్‌లో ఉన్న ధరలే నేడు కొనసాగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 54,700 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల ధర 59,660 రూపాయలుగా ఉంది.

ఇక నేడు వెండి ధర.. బంగారాన్ని ఫాలో అయ్యింది. నిన్నటితో పోల్చుకుంటే.. నేడు వెండి ధర స్థిరంగా ఉంది. ఇక సోమవారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 76,700 రూపాయలుగా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 73,300 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌తో పోల్చుకుంటూ హస్తినలో వెండి ధర కాస్త తక్కువగానూ.. బంగారం ధర కాస్త ఎక్కువగానూ ఉంటుంది. ఇందుకు కారణం.. స్థానికంగా ఉండే పన్నులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి