iDreamPost
android-app
ios-app

మహిళలకు ఊరట.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?

  • Published Dec 11, 2023 | 9:35 AM Updated Updated Dec 11, 2023 | 9:35 AM

దేశంలో బంగారం కోనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది. పండుగలు, శుభకార్యాలకు మహిళలు బంగారం ఆభరణాలు కొనేందుకు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు.

దేశంలో బంగారం కోనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది. పండుగలు, శుభకార్యాలకు మహిళలు బంగారం ఆభరణాలు కొనేందుకు జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు.

మహిళలకు ఊరట.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?

ఇటీవల కాలంలో దేశంలో వరుసగా బంగారం రేట్లు పెరిగిపోతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల కారణంగా బంగారం, వెండి ధరలు తరుచూ మారుతున్నాయి నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. సెప్టెంబర్ లో భారీగా పతనమైన బంగారం అక్టోబర్, నవంబర్ లో భారీగా పెరిగిపోయింది. ఈ నెలలో పసిడి కాస్త తగ్గు ముఖం పట్టింది. ఇక వెండి ధరలు అయితే భారీస్థాయిలో తగ్గాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకావం అని అంటున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం ధరల్లో మార్పు లేదు.. నిన్నటితో పోల్చుకుంటే స్థిరంగా కొనసాగుతుంది. దేశంలో బంగారం, వెండి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది.. పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదు.. దీంతో డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.. నేడు ధరల్లో ఎలాంటి మార్పులేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఇటీవల వస్తున్న మార్పుల ప్రభావం పసిడి, వెండిపై పడుతుంది. నిన్నటితో పోల్చుకుంటే నేటి ధరల్లో ఎలాంటి మార్పులు.. భవిష్యత్ లో గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇప్పుడు కొంటే మంచిదని అంటున్నారు నిపుణులు. నేడు తెలుగు రాష్ట్రల్లో ధరలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 57,150 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. రూ. 62,350 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర కిలో.. రూ. 78,000 వద్ద కొనసాగుతుంది.

reduced gold rates

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 57,300 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.62,500 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 57,300 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.62,500 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతాలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,150 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62,350 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.57,650 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 62,890 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరులో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,150 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 62,350 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ముంబై, ఢిల్లీ, కోలకతాల్లో రూ.76,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రెండ్ అవుతుంది.