iDreamPost

Gold Rate: పసిడి ప్రియులకు ఊహించని ఝలక్‌.. సీన్‌ రివర్స్‌.. భారీగా పెరిగిన ధర

  • Published Jul 05, 2024 | 7:52 AMUpdated Jul 05, 2024 | 7:52 AM

బంగారం ధర తగ్గినట్లే తగ్గి.. ఒక్కసారిగా భారీగా పెరుగుతూ.. పసిడి ప్రియులకు ఊహించని షాక్‌ ఇస్తోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

బంగారం ధర తగ్గినట్లే తగ్గి.. ఒక్కసారిగా భారీగా పెరుగుతూ.. పసిడి ప్రియులకు ఊహించని షాక్‌ ఇస్తోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 7:52 AMUpdated Jul 05, 2024 | 7:52 AM
Gold Rate: పసిడి ప్రియులకు ఊహించని ఝలక్‌.. సీన్‌ రివర్స్‌.. భారీగా పెరిగిన ధర

బంగారం కొనాలనుకునేవారు.. గత రెండు రోజులుగా దిగి వస్తోన్న ధర చూసి.. కాస్త ఊరట చెందారు. ఇలానే మరి కొన్ని రోజులు తగ్గితే.. బాగుంటుంది అనుకున్నారు. కానీ మనం అనుకున్నట్లు తగ్గితే.. అది బులియన్‌ మార్కెట్‌ ఎందుకు అవుతుంది. గంట గంటకు అక్కడ పరిస్థితులు మారుతుంటాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా మన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఇక మరి కొన్ని రోజుల్లో మన దేశంలో శుభకార్యాలు, పండగల సీజన్‌ ప్రారంభం కానుంది. దాంతో బంగారానికి డిమాండ్‌ మళ్లీ పెరుగుతుంది. అలానే వివాహాల సీజన్‌ ప్రారంభం కాబోతుంది. భారీ ఎత్తున గోల్డ్‌ కొనుగోళ్లు సాగుతాయని భావిస్తున్నారు. ఆ సమయంలో పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక మన దేశంలో గత రెండు రోజులుగా దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు భారీగా పెరిగింది. ఆ వివరాలు..

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో నేడు అనగా శుక్రవారం నాడు బంగారం ధర పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల మీద ఏకంగా 650 రూపాయలు పెరిగి.. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ. 67 వేల మార్కు వద్దకు చేరుకుంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా భారీగా పెరిగింది. పది గ్రాములు మీద ఏకంగా 710 రూపాయలు పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 24 స్వచ్ఛమైన గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 73,090 కి చేరింది.

today gold rate

హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర భారీగా పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర 650 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ. 67,150కు చేరింది. అలానే 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్ రేటు పది గ్రాముల మీద రూ. 710 పెరిగి.. రూ. 73,240 వద్ద అమ్ముడవుతుంది. అంతకుముందు రోజు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి రేటు స్థిరంగా ఉండగా.. దానికి ముందు రోజు రూ. 100 మేర పెరిగిందని చెప్పొచ్చు.

గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు భారీగా పెరిగితే.. వెండి కూడా అదే బాటలోనే పయనించింది. నేడు మన దేశంలో వెండి ధర కిలో మీద భారీగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా 1500 రూపాయలు పెరిగి.. రూ. 97,500 కు చేరింది.
అలానే ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు కేజీ మీద 1500 రూపాయలు పెరిగి.. రూ. 93 వేల మార్కు వద్దకు చేరుకుంది. వెండి ధర వరుసగా పెరుగుతుండటం గమనార్హం. 4 రోజుల వ్యవధిలోనే రూ. 3 వేలు పెరిగిందని చెప్పొచ్చు.

బంగారం, వెండి ధరలు ఇంతలా పెరగడానికి.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కారణం అవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే అప్పుడు యూఎస్ డాలర్ ఇంకా బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది. తాజాగా వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలతోనే బంగారం ధర పెరుగుతుంటే.. ఇంకా నిజంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇక పరిస్థితి ఊహించుకోవచ్చు అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి