iDreamPost
android-app
ios-app

బంగారం ధర ఇలా షాకిచ్చిందేంటి.. అక్కడ తగ్గినా.. మన దగ్గర మాత్రం!

  • Published Jul 07, 2023 | 10:36 AMUpdated Jul 07, 2023 | 10:36 AM
  • Published Jul 07, 2023 | 10:36 AMUpdated Jul 07, 2023 | 10:36 AM
బంగారం ధర ఇలా షాకిచ్చిందేంటి.. అక్కడ తగ్గినా.. మన దగ్గర మాత్రం!

మన దేశంలో బంగారం ధర అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి వస్తే.. దేశీయంగా తగ్గుతుంది.. అక్కడ పెరిగితే.. మన దేశంలో కూడా పెరుగుతుంది. కానీ కొన్ని సార్లు ఇందుకు భిన్నమైన పరిస్థితులు కూడా కనిపిస్తాయి. నేడు బంగారం ధర విషయంలో అదే పరిస్థితి కనిపించింది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే.. మన దేశంలో మాత్రం పసిడి రేటు స్వల్పంగా పెరిగింది. బంగారం కొనాలనుకునేవారు.. ఇప్పుడే త్వరపడితే.. మంచిది.. భవిష్యత్తులో పసిడి ధర పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు అంతర్జాతీయంగా బంగారం ధర ఎంత దిగి వచ్చింది… మన దగ్గర ఎంత పెరిగింది అంటే..

గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చినా.. మన దగ్గర మాత్రం పెరిగింది. నేడు హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్ల బంగారం ధర ఇలా ఉంది. భాగ్యనగరంలో నేడు పది గ్రాముల పసిడి రేటు స్పల్పంగా పెరిగింది. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 100 పెరిగి.. రూ. 54,250 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర రేటు పది గ్రాముల మీద 100 రూపాయలు పుంజుకొని.. ప్రస్తుతం రూ.59,160 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా పసిడి రేటు పైకి ఎగబాకింది. ప్రస్తుతం అక్కడ 22 క్యారెట్‌ బంగారం రేటు రూ. 100 పెరిగి రూ.54,400 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర రూ.59,320 వద్ద ఉంది.

నేడు వెండి ధర కూడా బంగారం బాటలోనే పైకి ఎగబాకింది. దేశీయ మార్కెట్‌లో పసిడి ధరతో పాటే వెండి రేట్లు కూడా పెరిగాయి. నేడు హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కిలో మీద ఒక్క రోజులోనే ఏకంగా రూ. 900 పెరిగి షాకిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,700 మార్కు వద్ద కదలాడుతోంది. ఇక అటు హస్తినలో కూడా వెండి ధర భారీగానే పెరిగింది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 800 పెరగి ఇప్పుడు రూ.73 వేల వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ధర దిగి వచ్చింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్ల నుంచి 1910 డాలర్లకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 22.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి