iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం ధర!

  • Published Jul 18, 2023 | 8:21 AMUpdated Jul 18, 2023 | 8:21 AM
  • Published Jul 18, 2023 | 8:21 AMUpdated Jul 18, 2023 | 8:21 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం ధర!

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచాన వేయడం చాలా కష్టం. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. ఈ ఏడాది బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తుంన్నారు. ఇప్పటికే 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 60 వేల రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే. ఇక జూలై నెల ప్రారంభం నుంచి బంగారం ధర తగ్గడం, స్వల్పంగా పెరగడం వంటి ట్రెండ్‌ కొనసాగింది. కానీ గత వారం మాత్రం బంగారం ధర భారీగా పెరిగి.. మరో సారి 24 క్యారెట్‌ పసిడి 10 గ్రాముల రేటు 60 వేల రూపాయలు తాకింది. అలానే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర కూడా 55 వేల రూపాయలకు చేరింది. అయితే గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. మరి నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది.. మన దగ్గర వేర్వేరు ప్రధాన నగరాల్లో పసిడి రేటు ఎంత తగ్గింది అంటే..

ఇక ఇటీవల కాలంలో దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల రేటు స్వల్పంగా దిగి వచ్చి.. రూ. 54,980గా ఉంది. క్రితం సెషన్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర ఇది రూ.55 వేల వద్ద ఉండేది. అలానే 24 క్యారెట్‌ బంగారం ధర కూడా నేడు దిగి వచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్‌ పుత్తడి ధర రూ.60 వేల మార్క్ నుంచి రూ.59,980 కి పడిపోయింది. అలానే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 22 క్యారెట్‌ బంగారం ధర రూ.55,130 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర రూ.60,130 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధర తగ్గిన నేపథ్యంలో వెండి రేటు కూడా పడిపోతుంది. నేడు హైదరాబాద్‌లో వెండి రేటు దిగి వచ్చింది. గత కొన్ని రోజులుగా వెండి ధర కిలో మీద భారీగా పెరగ్గా.. నేడు స్వల్పంగా తగ్గింది. ఇక మంగాళవారం హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 300 పడిపోయి ప్రస్తుతం రూ.81,500 పలుకుతోంది. ఇక ఢిల్లీలో కూడా ఢిల్లీలో కిలో వెండి రేటు నేడుపెరిగి రూ.77,700 మార్కు వద్ద ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1955 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 24.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి