iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు ఊరట.. నేటి ధరలు ఇవే!

  • Published Oct 12, 2023 | 8:37 AM Updated Updated Oct 12, 2023 | 8:37 AM
పసిడి ప్రియులకు ఊరట.. నేటి ధరలు ఇవే!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్-పాలస్తీన యుద్దం గురించిన చర్చలే జరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రస్తుతం బంగారం, వెండిపై పడటంతో గత ఐదు రోజుల నుంచి వీటి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండుగల సీజన్.. దాంతో పాటు పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు కూడా ఉండటంతో మహిళలు బంగారం ఆభరణాల కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. గత నెల రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ఐదు రోజుల నుంచి మళ్లీ చుక్కలు చూపిస్తుంది. దేశీయ మార్కెట్ లో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఉరటకలిగించే విషయం అని చెప్పొచ్చు. నేడు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారు ప్రియులకు కాస్త ఉరట.. గత 5 రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం నేడు స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తినాల మధ్య భీకర యుద్దం కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పై కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బులియన్ మార్కెట్‌లో నేడు పసిడి ధర 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650 గా కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే పెద్దగా మార్పులేదు. యుద్దం తీవ్రమైతే రానున్న రోజుల్లో పసిడి ధర మరింత భారం అవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కొనుగోలు కోసం జ్యూవెలరీ షాపులకు క్యూ కడుతున్నారు మహిళలు.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530గా కొనసాగుతుంది. ఇదే ధర ప్రధాన నగరాలైన ముంబై, కేరళ, బెంగుళూరులో కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,680గా ట్రెండ్ అవుతుంది. దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే నేడు వెండి ధర రూ.500 లకు తగ్గింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో కిలో వెండి ధర రూ.75,000 గా కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.72,000 లుగా కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000 గా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,000లుగా ట్రెండ్ అవుతుంది.