iDreamPost
android-app
ios-app

దిగొస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ధర ఎంతంటే?

మగువలకు గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ నేడు తులం ధర ఎంత ఉందంటే?

మగువలకు గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ నేడు తులం ధర ఎంత ఉందంటే?

దిగొస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ధర ఎంతంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇటీవలి కాలంలో ఆకాశమే హద్దుగా పైకి ఎగబాకిన గోల్డ్ ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. పెరిగిన ధరలతో బంగారం కొనాలంటేనే వెనకడుగు వేసిన వారికి నేడు పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఊరట లభిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ తగ్గాయి. బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి ఇదే మంచి ఛాన్స్. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 తగ్గి రూ. 72,220 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గడంతో రూ. 66,240 వద్ద ట్రేడ్ అవుతున్నది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,230 వద్దకుచేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 66,250 వద్ద అమ్ముడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ రూ. 150 తగ్గి రూ. 72 వేల 380 వద్ద ట్రేడవుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ. 66 వేల 400 వద్దకు పడిపోయింది.

today gold rates

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నది. నేడు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 96,100 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కిలో సిల్వర్ ధర రూ. 96,100వద్ద ట్రేడ్ అవుతున్నది. ఢిల్లీలో కిలో వెండి ధరపై రూ. 100 తగ్గింది. దీంతో నిన్న రూ. 91700 పలికిన సిల్వర్ ధర నేడు తగ్గిన ధరలతో 91600 వద్ద కొనసాగుతున్నది.