స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే

బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగులుతోంది. మళ్లీ గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. నేడు తులంబంగారంపై స్వల్పంగా పెరిగింది. మార్కెట్ లో నేడు తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే?

బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగులుతోంది. మళ్లీ గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. నేడు తులంబంగారంపై స్వల్పంగా పెరిగింది. మార్కెట్ లో నేడు తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే?

బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్. నేడు బంగారం వెండి, ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో గోల్డ్ ధరలు పెరగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడిపెట్టేందుకు పసిడి ప్రియులు మొగ్గుచూపుతున్నారు. అయితే ధరలు పెరుగుతుండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? నేడు తులం గోల్డ్ ధర ఎంతుందంటే?

బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. తులం బంగారంపై రూ. 10 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ. 67,310వద్ద అమ్ముడవుతోంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, బెంగళూరు, ముంబై, కోల్ కత్తా, చెన్నై వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని హస్తినలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,550 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,460 వ్దద అమ్ముడవుతోంది. అయితే ఇప్పటి వరకు ఊరట కలిగించిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండడంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. సిల్వర్ ధరలు అంతకంతకు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. నేడు వెండి ధరలు కిలో వెండిపై 100 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 98,100 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, ముంబై, చెన్నై నగరాల్లో రూ. 98,100 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 93,600 గా ఉంది. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మరి బంగారం, వెండి ధరలు పెరుగుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments