iDreamPost

Gold Price: రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధర! 70 వేలకు చేరువ!

  • Published Apr 02, 2024 | 8:34 AMUpdated Apr 02, 2024 | 1:24 PM

గత కొంతకాలంగా పైపైకి దూసుకుపోతున్న బంగారం ధర నేడు గరిష్ట స్థాయిలో పెరిగింది. 70 వేల రూపాయలకు చేరువయ్యింది. ఆ వివరాలు..

గత కొంతకాలంగా పైపైకి దూసుకుపోతున్న బంగారం ధర నేడు గరిష్ట స్థాయిలో పెరిగింది. 70 వేల రూపాయలకు చేరువయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 02, 2024 | 8:34 AMUpdated Apr 02, 2024 | 1:24 PM
Gold Price: రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధర! 70 వేలకు చేరువ!

బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాల వేళ కచ్చితంగా పసిడి కొనుగోలు చేస్తారు. మన దేశంలో పుత్తడి అంటే కేవలం ఖరీదైన ఆభరణం మాత్రమే కాదు.. అక్కరకు ఆదుకునే ఆదాయ వనరు కూడా. అందుకే చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉంటే కనకం కొనుగోలుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అయితే గత కొన్నాళ్లుగా బంగారం రేటు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతుంది. ఇక బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే ఈ ఏడాది పసిడి ధర 70 వేల మార్క్ కు చేరింది. మరి గోల్డ్ రేటు ఇంతలా పెరుగుతున్న వేళ కొనాలా.. వద్దా.. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏమంటున్నారంటే..

గత కొన్ని రోజులుగా బంగారం ధరలో అనిశ్చిత నెలకొని ఉంది. కొన్నాళ్ల పాటు వరుసగా పెరిగితే.. మరికొన్నాళ్లు దిగి వచ్చింది. ఇక నేడు అనగా మంగళవారం నాడు పసిడి ధర భారీగా పెరిగింది. పది గ్రాములు మీద రికార్డు స్థాయిలో 930 రూపాయలు పెరిగి షాకిచ్చింది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది అంటే.. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద నేడు ఒక్కరోజే ఏకంగా రు.930 మేర పెరిగింది. దాంతో నేడు భాగ్యనగరంలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల రేటు 69,530కి చేరుకుని 70 వేల మార్క్ ను తాకేందుకు రెడీ అయ్యింది.

అలానే నేడు హైదరాబాద్ లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర రూ.850 మేర పెరిగింది. దీంతో నేడు నగరంలో 22 క్యారెట్ పుత్తడి పది గ్రాముల ధర రూ. 63,750కి చేరుకుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. హస్తినలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాముల మీద రూ.850 మేర పెరిగి రూ. 63,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి రేటు 10 గ్రాముల మీద రూ.930 పెరిగి రూ. 69,530 వద్దకు చేరుకుంది.

గోల్డ్ దారిలోనే సిల్వర్..

నేడు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. భారీగా పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కేజీ మీద రూ.600 మేర పెరిగింది.దాంతో నేడు భాగ్యనగరంలో కిలో సిల్వర్ రేటు రూ. 78, 600 కి చేరుకుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో సైతం వెండి ధర భారీగానే పెరిగింది. కేజీ మీద రూ. 600 పెరిగి రూ. 78,600 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

ఇక బంగారం, వెండి ధరలు ఇప్పట్లో దిగి రావని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. పెట్టుబడిపరంగా గోల్డ్ కొనాలునుకునే వారు కొనగోలు చేయవచ్చిన.. కానీ పెళ్లిళ్ల కోసం బంగారం తీసుకోవాలనుకునే వారు మాత్రం కొన్ని రోజులు ఎదురు చూస్తే మంచిది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి