iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

  • Published Sep 26, 2023 | 1:57 PM Updated Updated Sep 26, 2023 | 1:57 PM
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

ఈ మధ్య బంగారం, వెండి ధరలు జట్ స్పీడ్ గా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ బంగారం ధరలు పోయిన సెషన్ లో మరోసారి పెరిగాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనాలా వద్దా.. మళ్లీ ధరలు ఏమైనా తగ్గుతాయా? అన్న సందిగ్ధంలో పడిపోయారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాదలచిన వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

భారత దేశంలో బంగారం, వెండి కొనుగోలుదారుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. దీంతో మార్కెట్ లో వీటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఇక భారతీయ మహిళలు, పురుషులు బంగారం అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశ ఆర్థిక, భౌగోలిక, సామాజిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం ధరలు మార్కెట్ మరిపోతూ వస్తున్నాయి.

నేడు మంగళవారం, సెప్టెంబర్ 26 దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.54,950వద్ద ట్రెండ్ అవుతుంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,495 గా కొనసాగుతుంది. నిన్న సోమవారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్ గోల్డ్ మార్కెట్ లో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. 10 గ్రాముల గోల్డ్ (22 క్యారెట్స్) ధర రూ.54,950 గా పలుకుంతుంది. 10 గ్రాముల గోల్డ్ (24 క్యారెట్స్) ధర రూ.59,950 గా పలుకుతుంది. విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర రూ.60,100 గా ట్రెండ్ అవుతుంది. పది గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.55,100 గా ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,220 గా కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర రూ.59,950 గా ఉండగా, 10 గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.54,950 గా కొనసాగుతుంది. దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.79,00 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000, ముంబాయి, ఢిల్లీ, కోల్ కొతా లాంటి నగరాల్లో రూ.75,800, బెంగళూరు లో కిలో వెండి ధర రూ.75,000 వద్ద ట్రెండ్ అవుతుంది.