iDreamPost
android-app
ios-app

పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..?

పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..?

బంగారం ఇష్టపడని మనిషే ఉండడు. ఇప్పటి వరకు ఎక్కువగా మహిళలే మక్కువ చూపించేవారు. ఇప్పుడు వీరితో పోటీ పడుతున్నారు పురుషులు సైతం. పసిడి ఆభరణాలు ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుత్తడిపై పెట్టుబడులు పెడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ఆపదలో కూడా ఆదుకుంటున్న నేపథ్యంలో బంగారం కొనడంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే దేశంలో పసిడికి డిమాండ్ బాగా పెరిగింది. బంగారంతో పాటు వెండికి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి. శ్రావణ మాసంలో గత మూడు రోజుల నుండి తగ్గిన బంగారం ధర..శనివారం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో పది గ్రాముల పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

24 క్యారెట్ల మేలిమి పసిడి ధర పది గ్రాములపై రూ.110 పెరిగింది. దీంతో తిరిగి 60 వేల మార్కుకు చేరింది. కాసు( 8 గ్రాములు) బంగారం ధర రూ. 44 వేలకు చేరింది. ఈ పెరుగుదలతో తులం పసిడి ధర రూ. 60 వేలకు పెరిగింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,890గా ఉండేది. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 100 పెరిగి.. రూ. 55,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 54,900గా ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. దేశంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం సిల్వర్ ధరలో ఎటువంటి హెచ్చు తగ్గులు చోటుచేసుకోలేదు. 8 గ్రాముల వెండి ధర రూ . 620గా ఉంది. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,750గా ఉంది. కేజీ సిల్వర్ ధర మార్కెట్‌లో రూ. 77,500 పలుకుతోంది. ఆభరణాల విషయానికి వస్తే బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. తరుగు, మజూరీని బట్టి..  ఆభరణాల ధరలను నిర్ణయిస్తుంటారు తయారీ దారులు/ షాపు యజమానులు.