iDreamPost
android-app
ios-app

కేవలం రూ.15 వేల పెట్టుబడితో.. నెలకు రూ. 90 వేల ఆదాయం!

ఈ మధ్య స్రీట్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లు టిఫిన్లు, తినుబండారాల కోసం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ను ఆశ్రయిస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్ ను రుచిగా తయారు చేసి విక్రయిస్తూ అధికా లాభాలను పొందుతున్నారు స్ట్రీట్ వెండర్స్.

ఈ మధ్య స్రీట్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లు టిఫిన్లు, తినుబండారాల కోసం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ను ఆశ్రయిస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్ ను రుచిగా తయారు చేసి విక్రయిస్తూ అధికా లాభాలను పొందుతున్నారు స్ట్రీట్ వెండర్స్.

కేవలం రూ.15 వేల పెట్టుబడితో.. నెలకు రూ. 90 వేల ఆదాయం!

ప్రస్తుత రోజుల్లో అందరి ఆలోచన వ్యాపారం దిశగానే సాగుతోంది. ఎక్కడో ఎవరి దగ్గరో ఉద్యోగం చేసే కంటే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని చూస్తున్నారు. అయితే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా అవసరమే. కాకపోతే ఎక్కువ లాభాలు రావాలంటే కాస్త పెట్టుబడి కూడా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగానే ఓ వ్యక్తి కేవలం రూ. 15 వేల పెట్టుబడి పెట్టి ఏకంగా నెలకు రూ. 90 వేల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇంతకీ ఆ వ్యాపారం ఏమిటి? ఆ బిజినెస్ సక్సెస్ కి కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య స్రీట్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లు టిఫిన్లు, తినుబండారాల కోసం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ను ఆశ్రయిస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్ ను రుచిగా తయారు చేసి విక్రయిస్తూ అధికా లాభాలను పొందుతున్నారు స్ట్రీట్ వెండర్స్. ఇదే తరహాలో జిలేబీ వ్యాపారం కూడా లాభదాయకంగా మారింది. హర్యానకు చెందిన వ్యక్తి జిలేబీ విక్రయిస్తూ నెలకు రూ. 90 వేల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు గ్రామంలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని ఈ జిలెబీ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు హర్యానకు చెందిన ఓం ప్రకాష్. అయితే ఈ హర్యాన జిలేబీ బేకరీ, స్వీట్ షాప్ లల్లో లభించే జిలేబీ కంటే ఎక్కువ రుచి ఉండడంతో కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

కొంత కాలం క్రితం హర్యానా నుంచి పొట్ట చేత పట్టుకుని నందికొట్కూరు వచ్చిన వీరు తమదైన శైలిలో జిలేబీని తయారీ చేస్తున్నారు. రుచిగా ఉండడంతో ఒక్కసారి వచ్చిన కస్టమర్లు మళ్లీ మళ్లీ వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీతో ప్రతిరోజు 40 కేజీల దాకా ఈ హర్యానా జిలేబిని అమ్మడం జరుగుతుందని నిర్వాహుకుడు ఓం ప్రకాశ్ ఓ మీడియా ద్వారా వెల్లడించారు. 25 సంవత్సరాల క్రితం రూ.15000 వేలు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించామని ఓం ప్రకాశ్ తెలిపారు. ఈ జిలేబీ తయారీకి చేసే ఖర్చు రూ.4000 దాకా ఉంటుందని ఓం ప్రకాశ్ చెప్పారు. ఖర్చులు పోను రోజుకు రూ.3 వేల వరకు ఆదాయం ఉంటుందని చెప్పారు. దీంతో నెలకు దాదాపు రూ. 90 వేలు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. మరి మీరు కూడా జిలేబి వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి