iDreamPost
android-app
ios-app

గేమింగ్ కోసం బడ్జెట్ ఫోన్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

  • Published Aug 26, 2024 | 1:00 AM Updated Updated Aug 26, 2024 | 1:00 AM

Best Smart Phones: గేమింగ్ కోసం తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి మార్కెట్లో చాలా ఫోన్లు ఉన్నాయి. అయితే వాటిలో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Best Smart Phones: గేమింగ్ కోసం తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి మార్కెట్లో చాలా ఫోన్లు ఉన్నాయి. అయితే వాటిలో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గేమింగ్ కోసం బడ్జెట్ ఫోన్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

గేమింగ్ కోసం బడ్జెట్ ధరలో దొరికే మంచి స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1) iQOO Z9s:
ఇది 6.77-అంగుళాల స్క్రీన్ కలిగి HD అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ మొబైల్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వర్క్ అవుతూ, 4nm ప్రాసెస్‌తో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్ ఇస్తుంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన FuntouchOS 14పై పనిచేస్తుంది.. కంపెనీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఎక్కేందుకు వీలుగా 5,500 mAh బ్యాటరీ కెపాసిటీని ఈ స్మార్ట్ ఫోన్లో ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ 50 మెగా పిక్సల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగా పిక్సల్ కెమెరాలని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17999 నుంచి స్టార్ట్ అవుతుంది.

2) Vivo T3:
ఇక వివో టి3 5G మొబైల్ విషయానికి వస్తే.. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ అమోల్డ్ డిస్‌ప్లేని కలిగి వుంది. ఇది వివో యొక్క మిడ్-రేంజర్ 4nm మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 8GB వరకు ర్యామ్ ని అందిస్తుంది. అంతేగాక 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజిని ఇస్తుంది. దీన్ని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఇది 50MP + 2MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీని ధర విషయానికి వస్తే రూ. 21999 ఉంటుంది. అయితే ఫ్లిప్కార్ట్ లో దీనిపై భారీ ఎక్స్చేంజి ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ కింద దీనిపై ఏకంగా రూ. 9300 వరకు తగ్గింపు ఉంటుంది.

3) CMF ఫోన్ 1:
CMF ఫోన్ 1 4nm ప్రాసెస్తో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే.. ఇది 8GB వరకు ర్యామ్ ని ఇస్తుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీన్ని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB దాకా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ OS 2.6తో రన్ అవుతుంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇది 50MP+2MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇది కూడా బడ్జెట్ ఫోన్ కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ ధర 16 వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది.

4) OnePlus Nord CE 4 Lite:
ఇది 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పూర్తి-HD+ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే.. దీనికి 8GB ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజిని ఇస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14పై పనిచేస్తుంది.కెమెరా విషయానికొస్తే, ఫోన్ 50MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. అలాగే 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 5,500mAh బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర ఫ్లిప్కార్ట్ లో 21 వేల పైనే ఉంది. కానీ బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ ని 20 వేల లోపే పొందవచ్చు.

5) Realme Narzo 70 Pro:
ఈ స్మార్ట్ ఫోన్ 2400×1800 పిక్సెల్‌లతో 6.7-అంగుళాల పూర్తి HD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ TSMC 6nm ప్రాసెస్ ఆధారంగా మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే.. ఇందులో 8GB వరకు ర్యామ్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని కెమెరా విషయానికి వస్తే.. దీనికి 50 ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిపై కూడా భారీ తగ్గింపు ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ 18 వేల దాకా ఉంది. కానీ బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ని ఇంకా తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.