iDreamPost

మహిళల కోసం అద్భుమైన పథకాలు.. వీటిల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్ బంగారమే!

కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మహిళల కోసం రెండు అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడిపెడితే భవిష్యత్ బంగారుమయమే.

కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మహిళల కోసం రెండు అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడిపెడితే భవిష్యత్ బంగారుమయమే.

మహిళల కోసం అద్భుమైన పథకాలు.. వీటిల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్ బంగారమే!

ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వంటింటి నుంచి అంతరిక్షం వరకు తమకు తామే సాటి మాకు మేమే పోటీ అన్నట్లుగా మహిళలు దూసుకెళ్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉండేలా గొప్ప గొప్ప పనులకు శ్రీకారం చుడుతున్నారు. కాగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తున్నారు. భవిష్యత్ లో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ లల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతున్నారు. అయితే ఇవి రిస్క్ తో కూడుకున్నవి. ఈ క్రమంలో మహిళల కోసం రెండు అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడిపెడితే భవిష్యత్ బంగారుమయమే.

కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పథకాల్లో మహిళలు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులను అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోస్టాఫీస్ లో ప్రభుత్వ పథకాలకు మంచి వడ్డీరేట్లు లభిస్తున్నాయి. పోస్టాఫీస్ లో వివిధ రకాల డిపాజిట్ స్కీమ్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటిల్లో మహిళలకు ఉపయోగపడే పథకాలు కూడా ఉన్నాయి. అలాంటి స్కీమ్లలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఒకటైతే.. మరొకటి బాలికల కోసం ప్రత్యేకించిన సుకన్య సమృద్ధి యోజన. ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి రాబడులు అందుకోవచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్:

ఈ పథకాన్ని 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టారు. ఏ వయసు మహిళైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి రూ. 2లక్షలుగా ఉంటుంది. రెండేళ్ల పాటు దీనిలో పెట్టే పెట్టుబడిపై 7.50శాతం స్థిరమైన వడ్డీ రేటు అందుకోవచ్చు. అలాగే దీనిలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మీరు రూ. 1.50లక్షల వరకూ రాయితీ లభిస్తుంది. మీరు ఒకవేళ రూ. 2లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 2,32,044లక్షలు పొందే అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన:

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వడ్డీ రేటును 8శాతం నుంచి 8.2శాతానికి పెంచింది. దీంతో ఈ పథకంలో చేరిన వారికి మరింత లాభం చేకూరనున్నది. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా వచ్చే డబ్బు ఆ అమ్మాయి చదువులకు, పెళ్లికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చేరొచ్చు. అయితే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. ఏడాదిలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు వచ్చాక ఖాతా మెచ్యూరిటీతో ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరిచేందుకు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 28 లక్షల వరకు ఆదాయం

ఆడపిల్లలు గల తల్లిదండ్రులు వారి కూతురు పేరుపై ఖాతాను ఓపెన్ చేసి సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ. 5,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 28 లక్షల వరకు పొందే వీలుంది. నెలకు రూ. 5 వేల చొప్పున ఏడాదిలో మొత్తం రూ. 60,000 డిపాజిట్ అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం 8.2 శాతం వడ్డీతో, మీరు రూ. 28.73 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి