iDreamPost
android-app
ios-app

బడ్జెట్ ధరలో మంచి Sports Bike కావాలా? అయితే ఇవి బెస్ట్..!

  • Published Oct 28, 2024 | 1:00 PM Updated Updated Oct 28, 2024 | 1:00 PM

Sports Bikes: స్పోర్ట్స్ బైక్స్ మంచి లుక్ తో పాటు మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. మార్కెట్లో తక్కువ ధరకే మంచి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి.

Sports Bikes: స్పోర్ట్స్ బైక్స్ మంచి లుక్ తో పాటు మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. మార్కెట్లో తక్కువ ధరకే మంచి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి.

బడ్జెట్ ధరలో మంచి Sports Bike కావాలా? అయితే ఇవి బెస్ట్..!

యువతకు బైక్ అంటే ఓ ఎమోషన్. కాలేజీకి, ఉద్యోగానికి వెళ్ళే యూత్ ఎక్కువగా స్పోర్ట్స్ బైక్స్ ని ఇష్టపడతారు. స్పోర్ట్స్ బైక్స్ చాలా స్టైలిష్ గా, మంచి లుక్ తో ఎన్నో అప్డేటెడ్ ఫీచర్లని కలిగి ఉంటాయి. మార్కెట్లో యూత్ కోసం ఇలాంటి బైకులు అందుబాటులో ధరలో ఉన్నాయి. వాటిలో కేవలం రూ.1.50 లక్షల లోపు దొరుకుతున్న బెస్ట్ స్టైలిష్ బైక్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

బడ్జెట్ ధరలో మంచి స్పోర్ట్ బైక్ కావాలనుకునేవారికి హోండా ఎస్పీ 160 చాలా బెస్ట్ అనే చెప్పాలి. పైగా ఇది మంచి మైలేజీని కూడా ఇస్తుంది. ఈ బైక్ 65 కిలోమీటర్ల దాకా మైలేజీ ఇస్తుంది. దీనిలో సింగిల్ చానల్ abs, 276, 220 mm డిస్కు బ్రేకులు, టెలిస్కోపిక్ , మోనోషాక్ ఫోర్కులు, ఐదు స్పీడ్ గేర్ బాక్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో 162.71 సీసీ సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇది 13.27 హార్స్ పవర్, 14.58 nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక హోండా ఎస్పీ 160 బైక్ ధర కేవలం రూ.1.18 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.22 లక్షల దాకా మాత్రమే ఉంటుంది. ఇది మంచి స్టైలిష్ లుక్ తో పాటు రైడర్ కి మంచి కంఫర్ట్ ని కూడా ఇస్తుంది.

ఇక హీరో ఎక్స్ట్రీమ్ 160 RV కూడా బడ్జెట్ ధరలో సూపర్ బైక్ అనే చెప్పాలి. దీని లుక్ మామూలుగా ఉండదు. దీనిలో 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇది 16.6 హార్స్ పవర్, 14.6 nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్, మోనోషాక్ ఫోర్కులు, 276, 220 డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ABS వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇది లీటర్ కు 49.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.1.11 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి స్టార్ట్ అవుతుంది.

అలాగే TVS అపాచీ RTR 160 బైక్ కూడా తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ అనే చెప్పాలి. దీని ముందు టెలిస్కోపిక్, వెనుక మోనోషాక్ ఫోర్కుల సెటప్ ని ఫిక్స్ చేశారు. ఇందులో స్పీడ్ గేర్ బాక్స్, 270, 130 mm డిస్కు బ్రేకులు, డ్యూయల్ చానల్ abs వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 61 కిలోమీటర్ల దాకా మైలేజీ ఇస్తుంది. ఇందులో 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 17.30 హార్స్ పవర్ ని, 14.73 టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మూడు స్పోర్ట్స్ బైక్స్ మనకు తక్కువ ధరలో లభించే బెస్ట్ బైక్స్. మీకు బడ్జెట్ లో మంచి స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే వీటిని ట్రై చెయ్యండి. ఇక ఈ బైక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.