iDreamPost
android-app
ios-app

TATA కారు కొనాలనుకునే వారికి షాక్.. TATA పంచ్ ధర పెంపు!

ఈ మధ్య టాటా కార్లను కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ బిగ్ షాక్ ఇచ్చింది. టాటా మోటార్స్ పంచ్​ ఎస్​యూవీ ధరలను పెంచింది. దీంతో ఈ కారు కొనాలనుకునే వారికి కాస్త ఆర్థిక భారం పెరగనున్నది.

ఈ మధ్య టాటా కార్లను కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ బిగ్ షాక్ ఇచ్చింది. టాటా మోటార్స్ పంచ్​ ఎస్​యూవీ ధరలను పెంచింది. దీంతో ఈ కారు కొనాలనుకునే వారికి కాస్త ఆర్థిక భారం పెరగనున్నది.

TATA కారు కొనాలనుకునే వారికి షాక్.. TATA పంచ్ ధర పెంపు!

కరోనా అనంతరం వ్యక్తి గత వాహనాల్లో ప్రయాణించడానికే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్లు, టూవీలర్స్ విక్రయాలు పెరిగాయి. ఈ క్రమంలో పలు ఆటోమొబైల్ సంస్థలు కస్టమర్ల అభిరుచులకు తగిన విధంగా ఆధునిక ఫీచర్లతో సరికొత్త మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కాగా ఇటీవల దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు తమ కార్లపై ధరలను పెంచిన విషయం తెలిసిందే. నిర్వహణ వ్యయాలు, ముడిసరుకుల కొరత, విడిభాగాల కొరత, ఆర్థికమాంద్యం కారణంగా ధరలను పెంచేశాయి. తాజాగా టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ధరలను పెంచింది. దీంతో కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాక్ తగిలినట్లైంది. ఇంతకీ ధర ఎంత పెరిగిందంటే?

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్ పంచ్​ ఎస్​యూవీ ధరలను పెంచింది. దీంతో ఈ కారు కొనాలనుకునే వారికి కాస్త ఆర్థిక భారం పెరగనున్నది. భారత మార్కెట్ లో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​ ధర రూ. 17వేల వరకు పెరిగింది. పెరిగిన ధరలతో టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి.

టాటా పంచ్ ఫీచర్లు

టాటా పంచ్‌లో 1.2లీటర్ రెవోట్రాన్ ఇంజన్ ఉంటుంది. ఇది స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. ఇది.. 84 హెచ్​పీ పవర్​ని, 113 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. టాటా పంచ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 18.97 kmpl, ఆటోమేటిక్‌లో 18.82 kmpl మైలేజీని పొందొచ్చు. టాటా పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, మక్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా సేల్ అవుతున్న టాప్-10 వాహనాల్లో టాటా పంచ్ ఒకటి.