Suzuki: ఆ కంపెనీ స్కూటర్ తీసుకున్నారా?.. 4 లక్షల స్కూటర్లు రీకాల్‌.. ఇప్పుడే చెక్ చేసుకోండి

ఆ కంపెనీ స్కూటర్ తీసుకున్నారా?.. 4 లక్షల స్కూటర్లు రీకాల్‌.. ఇప్పుడే చెక్ చేసుకోండి

Suzuki: వాహనదారులకు బిగ్ అలర్ట్. తమ కంపెనీకి చెందిన దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. ఆయా మోడళ్లలో ఓ లోపాన్ని గుర్తించిన కారణంగా రీకాల్ ప్రక్రియను చేపట్టింది. మీ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి.

Suzuki: వాహనదారులకు బిగ్ అలర్ట్. తమ కంపెనీకి చెందిన దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. ఆయా మోడళ్లలో ఓ లోపాన్ని గుర్తించిన కారణంగా రీకాల్ ప్రక్రియను చేపట్టింది. మీ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి.

ఇటీవలి కాలంలో స్కూటీలకు ఆదరణ పెరిగింది. యువతీ యువకులు, మహిళలు స్కూటీలకే ప్రియారిటీ ఇస్తున్నారు. గేర్ లెస్ కావడం, నడిపేందుకు ఈజీగా ఉండడంతో స్కూటీలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. ఆ టూవీలర్ తయారీ కంపెనీ వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. తమ కంపెనీకి చెందిన 4 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. ఆయా మోడల్ స్కూటీల్లో లోపాన్ని గుర్తించి రీకాల్ ప్రక్రియను చేపట్టింది. మరి మీరు ఆ కంపెనీ స్కూటర్ తీసుకున్నారా? మీ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి. ఇంతకీ ఆ కంపెనీ ఏదంటే?

సుజుకీ కంపెనీకి చెందిన స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే వాహనాలకు మంచి ఆదరణ లభించింది. మరి మీరు కూడా సుజుకీ స్కూటర్ ను కలిగి ఉన్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. సుజుకీ నుంచి రిలీజ్ అయిన యాక్సెస్‌ 125, అవెనీస్‌ 125, బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ మోడళ్లు రీకాల్ చేసినవాటిలో ఉన్నాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెబ్‌సైట్లో ఆ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఇంతకీ వీటిల్లో తలెత్తిన లోపం ఏంటంటే?

సుజుకీ రీకాల్ చేసిన స్కూటర్లలో ఇగ్నిషన్ కాయిల్ లో వినియోగించే హై-టెన్షన్ కోర్డ్ లో లోపాన్ని గుర్తించింది కంపెనీ. ఈ లోపం కారణంగా ఆయా స్కూటీలు ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. అలాగే నీటిలో తడిసినప్పుడు స్పీడ్ డిస్ప్లే ఆగిపోయే అవకాశం ఉందని తెలిపింది. అయితే కంపెనీ రీకాల్ చేసిన వాహనాల్లో అత్యధికంగా 2.63 లక్షల ద్విచక్ర వాహనాలు సుజుకీ యాక్సెస్‌ మోడల్‌వే ఉన్నాయి. అవెనీస్‌ 1.25 లక్షలు, బర్గ్‌మాన్‌ స్ట్రీట్ స్కూటర్లు 72 వేలు ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ 30 నుంచి అదే ఏడాది డిసెంబర్‌ 3 మధ్య తయారుచేసిన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రకటించిన ఆయా మోడల్ స్కూటర్లు కలిగిన కస్టమర్లు సమీపంలోని సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని సుజుకీ కంపెనీ సూచించింది.

Show comments