iDreamPost
android-app
ios-app

స్పోర్టీ లుక్.. క్రేజీ ఫీచర్లతో సుజుకీ నుంచి సరికొత్త స్కూటర్..

  • Published Jul 25, 2024 | 10:27 PM Updated Updated Jul 25, 2024 | 10:27 PM

2024 Suzuki Avenis: వాహనదారులకు సుజుకీ నుంచి సరికొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. స్పోర్టీ లుక్ లో క్రేజీ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీని ధర ఎంతంటే?

2024 Suzuki Avenis: వాహనదారులకు సుజుకీ నుంచి సరికొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. స్పోర్టీ లుక్ లో క్రేజీ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీని ధర ఎంతంటే?

స్పోర్టీ లుక్.. క్రేజీ ఫీచర్లతో సుజుకీ నుంచి సరికొత్త స్కూటర్..

స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. గేర్ లెస్ కారణంగా స్కూటీలను కొనేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్టు చూపిస్తుంటారు. సిటీలో ఉండే వాళ్లకైతే స్కూటీలే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ లో అస్తమాను బైక్ గేర్లు చేంజ్ చేయాలంటే విసుగొస్తుంది. అంతేకాదు మహిళలకు కూడా స్కూటీలు డ్రైవ్ చేసేందుకు ఈజీగా ఉంటాయి. పిల్లలను స్కూల్లో దింపిరావడానికి, ఆఫీసులకు, ఇతర పనిమీద బయటకు వెళ్లేందుకు స్కూటీలే బెస్ట్. ఈ క్రమంలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ అదిరిపోయే స్కూటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సుజుకీ అవెనిస్ 2024ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది.

సుజుకీ కంపెనీకి చెందిన బైక్ లు, స్కూటీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ధర, మైలేజీ, ఫీచర్స్ అద్భుతంగా ఉండడంతో సుజుకీ వెహికిల్స్ కు ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు సుజుకీ అవెనిస్ పేరుతో తీసుకొచ్చిన స్కూటర్ స్పోర్టీ లుక్ లో ఆకట్టుకుంటోంది. దీనిలో క్రేజీ ఫీచర్లు అందించారు. దీని ధర రూ. 92,000(ఎక్స్ షోరూం)గా పేర్కొంది. బడ్జెట్ ధరలో వస్తున్న ఈ స్కూటర్ అన్ని ఏజ్ ల వారికి బెస్ట్ గా ఉంటుంది. ఈ స్కూటర్ నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. గ్లోసీ స్పార్కెల్ బ్లాక్/ పెరల్ విరా రెడ్, చాంపియన్ ఎల్లో నంబర్ 2/ గ్లోసీ స్పార్కెల్ బ్లాక్, గ్లోసీ స్పార్కెల్ బ్లాక్/ పెరల్ గ్లేసియర్ వైట్ కాంబినేషన్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త స్కూటర్లో 124.3 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.7హెచ్పీ, 10ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సేఫ్టీ షట్టర్, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ క్యాప్. 21.8 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్ ఉంటుంది. ముందు వైపు డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, ఎల్ఈడీ టైల్ ల్యాంపు ఉంటుంది. బ్లూటూత్ అనుసంధానమైన డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఈ కొత్త స్కూటర్లో ఉంటుంది.