iDreamPost
android-app
ios-app

నిమ్మకాయకి టైమొచ్చింది! 20 నిమ్మకాయలు కొనే డబ్బుతో కిలో చికెన్‌ వస్తుంది!

  • Published Mar 30, 2024 | 10:32 AM Updated Updated Mar 30, 2024 | 10:32 AM

Lemon Price: ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతుండడంతో మార్కెట్ లో నిమ్మకాయాల డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే భగ భగ మండే ఎండాలతో పాటు నిమ్మకాయల ధర కూడా భగ భగ మండుతుంది. దీంతో మార్కెట్లో నిమ్మకాయలు కొనాలంటేనే ప్రజలు లబోదిబో మంటున్నారు. అసలు మార్కెట్లో ఒక నిమ్మకాయ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Lemon Price: ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతుండడంతో మార్కెట్ లో నిమ్మకాయాల డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే భగ భగ మండే ఎండాలతో పాటు నిమ్మకాయల ధర కూడా భగ భగ మండుతుంది. దీంతో మార్కెట్లో నిమ్మకాయలు కొనాలంటేనే ప్రజలు లబోదిబో మంటున్నారు. అసలు మార్కెట్లో ఒక నిమ్మకాయ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Mar 30, 2024 | 10:32 AMUpdated Mar 30, 2024 | 10:32 AM
నిమ్మకాయకి టైమొచ్చింది! 20 నిమ్మకాయలు కొనే డబ్బుతో కిలో చికెన్‌ వస్తుంది!

ప్రస్తుతం వేసవి కాలం మొదలయ్యింది. భగ భగ మంటూ ఎండలు మండిపోతున్నాయి. అసలు ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్నిచూపుతున్నాడు. అది మొదలు సాయంత్రం 7 గంటలు అయినా వేడి మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే.. బయట తిరిగే ప్రజపలు ఈ వేసవి తాపాన్ని తగ్గించేందుకు రకరకాల పానీయాలను తాగేందుకు ఆసక్తి చూపుతారు. మరి ఆ పానీయాల్లో నిమ్మరసం కూడా ఒకటి. ఎందుకంటే.. నిమ్మరసం ఈ ఎండ వేడిని నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. మరి వేసవిలో అయితే నిమ్మకాయల డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటే ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. మండే ఎండలాతో పాటు నిమ్మకాయల ధర కూడా భగభగ మండుతుంది. ఇక వీటిని మార్కెట్ లో కోనుగోలు చేయాలంటే.. ప్రజలు వామ్మో నిమ్మకాయా ధర ఇంత అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక మోస్తరు సైజు నిమ్మకాయ ధరు అంత ఉండటంతో అసలు వీటిని కొనాలవద్ద అనే ఆలోచనలో ప్రజలు పడిపోయారు. ఇంతకి ఒక నిమ్మకాయ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

సాధారణంగా వేసవి కాలం ప్రతిఒక్కరూ బయట నుంచి ఇంటికి వచ్చినవారు.. చల్లని నిమ్మకాయ రసాన్ని తాగాలని అనుకుంటారు. ఎందుకంటే..ఈ నిమ్మరసాన్ని తాగితే శరీరంలో వేడిని తగ్గిచ్చడంతో పాటు తక్షణ శక్తిని అందిస్తుంది. మరి వేసవి వచ్చిదంటే చాలు ప్రతిఒక్కరి ఇళ్లలో నిమ్మకాయాలు ఉండడం కామన్. అలాగే మార్కెట్ వీటి గీరాకి బాగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఈ నిమ్మకాయల ధర ఆకాన్ని తాకుతున్నాయి. భగభగ మండే ఏండాలతో పాటు నిమ్మకాయల ధర కూడా మండుతోంది. ఈ క్రమంలోనే వీటిని కోనుగోలు చేయాలంటేనే ప్రజలు అల్లడిపోతున్నారు. ఎందుకంటే.. ఒక మోస్తరు నిమ్మకాయ ధర రూ. 5లకు హోల్ సేల్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు. కాగా, గతంలో పెద్ద సైజు నిమ్మకాయలు రూ.20కి 6 వచ్చేవి. కానీ, మొన్నటి వరకు మార్కెట్ లో రూ.20కి 3 మాత్రమే ఇచ్చేవారు.

కానీ ప్రస్తుతం చిన్న నిమ్మకాయ ధర ఒకటి రూ.5 కావడంతో వామ్మో ఇదేంటి ఇంత ధర అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎంత వేసవికాలం నిమ్మకాయల డిమాండ్ ఉన్న.. ధరలు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఎందుకంటే..వేసవి వేడి పెరిగేకొద్ది నిమ్మకాయ ధర పెరుగుతోంది. అలాగే గతంలో లెమన్ సోడా.. లెమన్ డ్రింక్ ధర రూ.20కి విక్రయించేవారు. కానీ, ఇప్పుడు రేట్లు పెరగడంతో మార్కెట్లో వాటి ధర కూడా రూ. 25 నుంచి రూ. 30 వరకు పెంచి విక్రయిస్తారు. ప్రస్తుతం ఒక మార్కెట్లో పెద్ద సైజు నిమ్మకాయ ధర రూ.10కి విక్రయిస్తున్నారు.

ఇక వీటి ధరలు చూసి సామాన్య ప్రజలకు గుండె ధర పెరిగిపోతుంది. పైగా ఎండకాలం డైట్ లో ఉన్నవారికి నిమ్మకాయ తప్పనిసరి ఉండాలి. మరి అలాంటప్పుడు నిమ్మకాయ ధరలు ఊహించిన దానికంటే.. ఎక్కువగా ఉండటంతో.. ప్రజలు కొనలేక, కొంటే..ఎక్కువగా కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి, మార్కెట్ లో నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని తాకడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.