P Venkatesh
పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకాలు అయితే ఉత్తమమో అని ఆలోచిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అందించే ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవచ్చు.
పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకాలు అయితే ఉత్తమమో అని ఆలోచిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అందించే ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవచ్చు.
P Venkatesh
మీ డబ్బును దేనిలోనైనా పెట్టుబడిపెడితే భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీరుస్తాయనడంలో సందేహం లేదు. ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మార్గాలున్నాయి. అయితే ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో పెట్టుబడిపెడితే అధిక లాభాలు అందుకోవచ్చు. అంతేకాదు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా మీ చేతికి చేరుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. ఆ పథకాలే సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్. మహిళలను పెట్టుబడి వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మహిళలకు ఆర్థికసాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే మంచి పెట్టుబడి పథకాలను తీసుకొస్తుంది. అయితే సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను అందుకోవచ్చు. మరి ఈ పథకాలకు ఎవరు అర్హులు?
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉద్దేశించబడింది. ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లైతే ఆ సొమ్ముపై కేంద్రం 8.2 శాతం వడ్డీని కలిపిస్తుంది. ఈ డబ్బు ఆ అమ్మాయి చదువులకు, పెళ్లికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చేరొచ్చు. అయితే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. ఏడాదిలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అమ్మాయికి 21ఏళ్లు వచ్చాక ఖాతా మెచ్యూరిటీ ఉంటుంది.
ఈ పథకంలో నెలకు రూ. 5,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ. 28 లక్షల వరకు పొందే వీలుంది. నెలకు రూ. 5 వేల చొప్పున ఏడాదిలో మొత్తం రూ. 60,000 డిపాజిట్ అవుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం 8.2 శాతం వడ్డీతో, మీరు రూ. 28.73 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.
మహిళల కోసం ప్రారంభించిన మరో గొప్ప పథకం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మార్చి 2025 వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు. ఈ పథకంలో వెయ్యి నుంచి రెండు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకం రెండు సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వార్షికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ ఫొటో ఇతర డ్యాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది.