iDreamPost
android-app
ios-app

కార్పొరేట్ జాబ్ వదిలేసి వ్యాపారం.. చిన్న ఐడియాతో కోట్లలో సంపాదిస్తున్నారు!

Sucess Story Of A Couple: ప్రస్తుతం అందరూ పర్యావరణం నాశనం అయిపోతోందని క్లాసులు పీకుతారు. కానీ, దానిని కాపాడేందుకు ముందుకు రారు. ఈ జంట మాత్రం పర్యావరణానికి మేలు చేస్తూనే కోట్లలో సంపాదిస్తున్నారు.

Sucess Story Of A Couple: ప్రస్తుతం అందరూ పర్యావరణం నాశనం అయిపోతోందని క్లాసులు పీకుతారు. కానీ, దానిని కాపాడేందుకు ముందుకు రారు. ఈ జంట మాత్రం పర్యావరణానికి మేలు చేస్తూనే కోట్లలో సంపాదిస్తున్నారు.

కార్పొరేట్ జాబ్ వదిలేసి వ్యాపారం.. చిన్న ఐడియాతో కోట్లలో సంపాదిస్తున్నారు!

ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం కొన్ని కామన్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భూమి కాలుష్యం కూడా ఒకటి. నిజానికి విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వాడకం అనేది పెద్ద విపత్తుగా మారిపోయింది. అలాగే అదే పెద్ద వ్యాపార మార్గం కూడా. ఇప్పుడు అనేక దేశాలు ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. వాటిలో నార సంచులు బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. అలాంటి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్న ఈ దంపతులు ఇప్పుడు ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నారు. మరి.. వాళ్ల సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం.

సక్సెస్ స్టోరీ మధురైకి చెందిన గౌరీ గోపీనాథ్- కృష్ణన్ సుబ్రమణియన్ దంపతులది. వీళ్లు కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవాళ్లు. అయితే వీరికి ఎప్పటికైనా ఒక మంచి వ్యాపారం చేయాలి అనే కల ఉండేది. సొంతూరికి వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్లు. అలాగే తాము చేసే వ్యాపారం కచ్చితంగా పర్యావరణానికి ఉపయోగంగా ఉండాలి అనుకున్నారు. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బూతాన్ని తరిమేయాలి అనుకున్నారు. పర్యావరణానికి మేలు చేసే సంచులను తయారు చేయాలి అనుకున్నారు. 2014లో ఈ జటం కలకు తొలి అడుగు పడింది.

ఎల్లో ప్యాక్ అనే సంచుల తయారీ పరిశ్రమను స్థాపించారు. జూటు నార, పత్తితో తయారు చేసే సంచులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. మొదట వాటిని తమ స్నేహితులు, బంధుమిత్రులు, సహోద్యోగులకు ఇచ్చి వాడి చూడమన్నారు. చిన్నగా వారి వ్యాపారం గురించి చుట్టుపక్కల వారికి తెలియడం స్టార్ట్ అయ్యింది. వ్యాపారం కూడా పెరగడం మొదలు పెట్టింది. పెరుగుతున్న డిమాండ్ ని తట్టుకోవడం కోసం వాళ్లు స్థానికంగా ఉండే టైలర్లను హైర్ చేసుకున్నారు. అలా ఎంత డిమాండ్ ఉన్నా కూడా దానిని తట్టుకుని ఉత్పత్తిని కొనసాగించారు. మొదట ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు కంపెనీ చూసుకుంటూ వచ్చారు. 2019లో మాత్రం ఉద్యోగాలకు స్వస్తి పలికి పూర్తిగా కంపెనీ పనుల్లోనే నిమగ్నమయ్యారు. మొదట్లో సోషల్ మీడియాలో మంచి ప్రమోషన్స్ చేసుకునే వారు. ఆ తర్వాత వీరి కంపెనీ పేరు జనాల్లో నానడం స్టార్ట్ అయ్యింది.

వీళ్ల దగ్గర సంచులు స్టార్టింగ్ రూ.20 నుంచి గరిష్టంగా రూ.200 వరకు ఉంటాయి. ఈ కంపెనీ ప్రస్తుతం రోజుకు 3,000 సంచులు తయారు చేసే స్థాయికి ఎదిగింది. తాజాగా వీళ్ల ఎల్లో బ్యాగ్స్ కంపెనీ టర్నోవర్ రూ.3 కోట్లు దాటేసింది. నిజంగా ఒక కల కోసం కృషి చేస్తే.. అది కచ్చితంగా సత్ఫిలితాలు ఇస్తుందని వీళ్లని చూస్తే అర్థం అవుతుంది. అలాగే పర్యావరణానికి మంచి చేయాలి అనుకున్న వారి సంకల్పం కూడా ఈ జంటకు అద్భుతమైన విజయాన్ని అందించింది. కొన్నేళ్ల వీళ్ల కల.. కొన్నేళ్ల వారి కృషి ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారి వారికి రూ.కోట్లలో సంపాదనను అందిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా నార సంచుల తయారీ పరిశ్రమ చక్కని ఫలితాలను ఇస్తుంది.