iDreamPost
android-app
ios-app

3 చక్రాల ఎలక్ట్రిక్ కారు! సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ. రేంజ్.. ధర ఎంతంటే?

  • Published Jul 30, 2024 | 6:18 PM Updated Updated Jul 30, 2024 | 6:18 PM

Storm Motors R3 Electric Car: మూడు చక్రాల ఎలక్ట్రిక్ కారు చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నా ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ధర కూడా తక్కువే. ట్రాఫిక్ లో సులువుగా వెళ్ళచ్చు. పార్కింగ్ కి సమస్య ఉండదు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ రేంజ్ తో వస్తుంది.

Storm Motors R3 Electric Car: మూడు చక్రాల ఎలక్ట్రిక్ కారు చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నా ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ధర కూడా తక్కువే. ట్రాఫిక్ లో సులువుగా వెళ్ళచ్చు. పార్కింగ్ కి సమస్య ఉండదు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ రేంజ్ తో వస్తుంది.

3 చక్రాల ఎలక్ట్రిక్ కారు! సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ. రేంజ్.. ధర ఎంతంటే?

నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ కారు చూశారు. కానీ ఇప్పుడు మీరు మూడు చక్రాల కారు గురించి తెలుసుకోబోతున్నారు. ఇంత చిన్నగా ఉంది.. ఇందులో ఫీచర్స్ ఏం ఉండవేమో అని అనుకుంటున్నారేమో. ఇందులో ఫీచర్స్ గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. స్ట్రామ్ మోటార్స్ ఆర్3 మోడల్ కారు ఇది. ఇది 2 సీటర్ హ్యాచ్ బ్యాక్ తో వస్తుంది. ఇది ఒకే వేరియంట్ లో, సింగిల్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఫీచర్ తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ సింగిల్ స్పీడ్ ఇన్ లైన్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇది నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. తెలుపు రూఫ్ తో ఎరుపు రంగు, నలుపు రంగు రూఫ్ తో తెలుపు రంగు, పసుపు రంగు రూఫ్ తో సిల్వర్ రంగు, తెల్ల రంగు రూఫ్ తో నీలం రంగులో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ తో 120 కి.మీ., 160 కి.మీ., 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ 80 కి.మీ.గా ఉంది. ఇందులో 15 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని ఇచ్చారు.

ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 గంటలు పడుతుంది. దీని గరిష్ట పవర్ 20.11 బీహెచ్పీ, గరిష్ట టార్క్ వచ్చేసి 90 ఎన్ఎంగా ఉంది. సీటింగ్ కెపాసిటీ ఇద్దరికి ఇచ్చారు. దీని బూట్ స్పేస్ 300 లీటర్లు ఇచ్చారు. 5 లక్షల బడ్జెట్ లో వచ్చే రెనాల్ట్ క్విడ్ బూట్ స్పేస్ 279 లీటర్లు, మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో బూట్ స్పేస్ 270 లీటర్లు, మారుతి సుజుకి ఆల్టో కే10 బూట్ స్పేస్ 214 లీటర్లు ఇచ్చారు. కానీ ఈ స్ట్రామ్ మోటార్స్ ఆర్3 ఎలక్ట్రిక్ కారు బూట్ స్పేస్ వీటి కంటే ఎక్కువగా ఉంది. 2 సీటర్ కాబట్టి బూట్ స్పేస్ ఎక్కువ ఇచ్చినా ఎలక్ట్రిక్ వేరియంట్ లో బడ్జెట్ లోపు ఇంత చిన్న సైజులో ఇంత బూట్ స్పేస్ తో రావడం అనేది చిన్న విషయం కాదు. ఎయిర్ కండిషనర్ ఉంది, ఫ్రంట్ పవర్ విండోస్, ఫాగ్ లైట్స్ ఇచ్చారు.

నావిగేషన్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కంట్రోల్, ఫ్రంట్ యూఎస్బీ ఛార్జర్ వంటివి ఇచ్చారు. ఇది రెండు డ్రైవ్ మోడ్స్ లో వస్తుంది. అలానే అలాయ్ వీల్స్ ఇచ్చారు. మాక్ ఫెర్సన్ స్ట్రక్ట్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ షాల్ అబ్జార్బర్స్ రేర్ స్పస్పెన్షన్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ హైడ్రాలిక్ డిస్క్, రేర్ బ్రేక్ డ్రమ్ ఇచ్చారు.  దీని కెర్బ్ బరువు 550 కిలోలు కాగా.. 185 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. దీనికి రెండు డోర్స్ ఇచ్చారు. ఇక దీని ధర విషయానికొస్తే ఎక్స్ షోరూం ధర నాలుగున్నర లక్షలుగా ఉంది. ఈ కారుకి సంబంధించి హైదరాబాద్ లో డీలర్స్ కూడా ఉన్నారు. కార్ దేఖో, జిగ్ వీల్స్ వంటి వెబ్ సైట్స్ లో ఆసక్తి ఉన్నవారు పేరు, వివరాలు ఇస్తే సంప్రదిస్తారు. 2025 జనవరి నెలలో ఈ కారుని లాంఛ్ చేయనున్నారు.