నేటి సమాజంలో చాలా మంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలలను సాకారం చేసుకోవడానికి తగినంత డబ్బులు వారివద్ద ఉండవు. దాంతో తమ కలలను అలాగే తమలో దాచుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ను తీసుకోచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటుతోనే ఈ లోన్ ను పొందవచ్చు. అదీకాక లోన్ తీసుకున్న 18 నెలల వరకు కట్టాల్సిన అవసరం లేదు. ఈ లోన్ ను ఎలా అప్లై చేసుకోవాలి? లాంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.
సొంతంగా వ్యాపారం చేయాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఓ బంగారం లాంటి స్కీమ్ ను తీసుకొచ్చింది. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ పురుషులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. రూ.10 లక్షల నుంచి రూ. 1 కోటి రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణం అందిస్తూ.. ప్రోత్సహిస్తోంది. ఈ డబ్బులను లోన్ తీసుకున్న 18 నెలల వరకు కట్టాల్సిన పనికూడా లేదు. “స్టాండప్ ఇండియా” స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పైన తెలిపిన రుణాన్ని ఇస్తోంది. ఈ స్కీమ్ ను ఆగస్టు 15, 2015లోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
కాగా.. ఇప్పటి వరకు ఈ రుణం కోసం 2 లక్షల 11 వేల 925 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో లక్షా 91 వేల 52 మందికి రుణాలు మంజూరు చేసింది కేంద్రం. ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలో 10 లేదా 15 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది. మిగతా పెట్టుబడి లోన్ రూపంలో బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఈ లోన్ ను 7 సంవత్సరాల్లోపు కట్టాల్సి ఉంటుంది. ఇక వడ్డి రేటు విషయానికి వస్తే.. MCLR రేటుకు 3 శాతం అదనంగా ఉండొచ్చు. వడ్డీ రేట్లు 11 నుంచి 13 శాతం మధ్య ఉంటుంది. కాగా.. లోన్ రావాలంటే ప్రాథమిక హామీతో పాటుగా స్టాండప్ ఇండియా రుణాల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ హామీ ఉండాలి.
ఇక ఈ స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే? ఈ పథకం ద్వారా రుణం పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అర్హులు నేరుగా బ్యాంక్ కు వెళ్లి ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే స్టాండప్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు. ఈ https://www.standupmitra.in/LDMS లింక్ ద్వారా డిస్ట్రిక్ మేనేజర్ వివరాలు పొందొచ్చు. https://www.standupmitra.in/Login/Register లింక్ ద్వారా నేరుగా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.