iDreamPost
android-app
ios-app

HYDలో ఇక్కడ రూ.22 వేలకే గజం స్థలం.. ఇప్పుడు కొంటే కనీసం రూ.15 లక్షలు లాభం!

  • Published May 11, 2024 | 4:38 PM Updated Updated May 11, 2024 | 4:38 PM

హైదరాబాద్ లో ఈ ఏరియాలో గజం స్థలం 22 వేలు. ఇప్పుడు గనుక ఈ ఏరియాలో స్థలం కొంటే గనుక కనీసం 10, 15 లక్షలు లాభం పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఈ ఏరియాలో గజం స్థలం 22 వేలు. ఇప్పుడు గనుక ఈ ఏరియాలో స్థలం కొంటే గనుక కనీసం 10, 15 లక్షలు లాభం పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

HYDలో ఇక్కడ రూ.22 వేలకే గజం స్థలం.. ఇప్పుడు కొంటే కనీసం రూ.15 లక్షలు లాభం!

తెలంగాణలో హైదరాబాద్ కి దగ్గరలో ఏ మూలన స్థలాలు కొన్నా గానీ లాభమే. ఎందుకంటే ఇప్పుడు పాలకులు ఒకప్పటిలా ఒకే ఏరియా మీద ఫోకస్ చేయడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల, తెలంగాణలో ఉన్న చాలా ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ నగరం కూడా నలుదిక్కులా విస్తరిస్తోంది. కాబట్టి దూరం పెద్ద మేటర్ కాదు. ఇక స్థలం మీద పెట్టుబడి పెట్టింది వృధా పోదు. అక్కడ ఇండస్ట్రీలు డెవలప్ అవుతాయి. రెసిడెన్షియల్ హబ్ గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 

ఈ ఏరియాలోనే ఎందుకు కొనాలి?

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టతగ్గ ఏరియాల్లో తిమ్మాపూర్ ఒకటి అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. తిమ్మాపూర్ ఇప్పుడు రెసిడెన్షియల్ లొకేషన్ గా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాన ప్రాంతాలకు దగ్గరగా ఉండడం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంది. అన్మోల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలు, ఓవెన్స్ కార్నింగ్ ఇండస్ట్రీలు, ఓవెన్స్ కార్నింగ్ ఫ్యాక్టరీ, షాపింగ్ మాల్స్, సూపర్ మర్కెట్స్, రెస్టారెంట్స్, ఫిట్నెస్ సెంటర్స్, స్కూల్స్, బ్యాంక్స్ వంటి కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉండడం చేత తిమ్మాపూర్ అనేది చాలా మంది ప్రాపర్టీ కొనాలనుకునేవారి జాబితాలో టాప్ లో ఉంది. ఆయా పరిశ్రమలు ఉన్న కారణంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రీల హబ్ గా తిమ్మాపూర్ మారనుంది. 

24/7 విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్లు, మెట్రో పార్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ వంటివి చాలా ఉన్నాయి. పేరున్న డెవలపర్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకునేందుకు తిమ్మాపూర్ ని డెవలప్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే నివాస ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేసిన కస్టమర్లకు అద్భుతమైన సౌకర్యాలను అందించేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. పలు స్కూల్స్, కాలేజీలు కూడా ఉన్నాయి.

పెద్ద ఎత్తున ఐటీ పార్క్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, మాల్స్ రానున్నాయి.  లైఫ్ హాస్పిటల్, లిమ్స్ హాస్పిటల్, నక్షత్ర హాస్పిటల్, సాయి సంహిత హాస్పిటల్ వంటివి ఆల్రెడీ తిమ్మాపూర్ లో సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్-బెంగళూరు హైవేకి కనెక్ట్ అయి ఉండడం, అవుటర్ రింగ్ రోడ్ కి 12 కి.మీ., శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 19 కి.మీ., మహేశ్వరం రోడ్ కి 14 కి.మీ. దూరంలో ఉండడం కారణంగా ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఏరియా బయ్యర్స్ ని ఆకర్షిస్తుంది. తిమ్మాపూర్ లో రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ ఉన్నాయి. ఫలక్ నుమా మెట్రో స్టేషన్ కి 17 కి.మీ. దూరంలో ఈ తిమ్మాపూర్ ఉండడం ప్లస్ పాయింట్.

ధరలు ఎలా ఉన్నాయంటే?:

ఐదేళ్ళలో ఇక్కడ 250 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2019లో తిమ్మాపూర్ లో చదరపు అడుగు 800 రూపాయలు ఉంటే 2020 వచ్చేసరికి 1550 రూపాయలు అయ్యింది. రెండు సంవత్సరాల్లో అంటే 2022లో 2000 రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం చదరపు అడుగు స్థలం తిమ్మాపూర్ లో రూ. 2,450గా ఉంది. ఈ ఐదేళ్ళలో చదరపు అడుగు మీద రూ. 1650 పెరిగింది. అంటే గజం మీద దాదాపు 15 వేలు పెరిగింది. 2019లో గజం 7,200 ఉంటే ఇప్పుడు రూ. 22,050 రూపాయలు పలుకుతుంది. 150 గజాల స్థలం కొనాలంటే 33 లక్షలు అవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో తిమ్మాపూర్ లో స్థలాలు దొరకడం నిజంగా గొప్ప విషయమే.  

ఐదేళ్ళలో ఎంత లాభం:

ఇప్పుడు చదరపు అడుగు స్థలం రూ. 2,450గా ఉంది. ఐదేళ్ళలో 5000 రూపాయలు అయినా గానీ లక్షల్లో లాభం పొందవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు 22 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొనుగోలు చేసినట్లయితే.. ఐదేళ్ళలో ఆ స్థలం విలువ గజం 45 వేలు చొప్పున 100 గజాలకు 45 లక్షలు లాభం వస్తుంది. పెట్టిన పెట్టుబడికి సగం లాభం వస్తుంది. కనీసం చదరపు అడుగు 4 వేలు అయినా గానీ గజం 36 వేలు అవుతుంది. ఈ లెక్కన చూసినా గానీ 100 గజాలకు 36 లక్షలు అవుతుంది. ఇలా చూసినా లాభమే. ఐదేళ్ళలో 14 లక్షలు లాభం వస్తుంది. ఏడాదికి 2,80,000 లాభం వచ్చినట్టే. కాబట్టి తిమ్మాపూర్ లో స్థలం కొనడం లాభదాయకమే అని స్పష్టంగా అర్థమవుతుంది.     

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.