iDreamPost
android-app
ios-app

బంగారు నగలు కొంటున్నారా? నష్టమే తప్ప లాభం లేదు.. ఈ ప్రభుత్వ గోల్డ్ స్కీం బెస్ట్!

  • Published Jul 23, 2024 | 9:30 PM Updated Updated Jul 23, 2024 | 9:30 PM

Gold Ornament: మన దేశంలో బంగారంపై జనాల్లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసిడి ఆభరణాలను ధరించడమే కాదు.. దాన్ని పెట్టుబడిలా కూడా చూస్తుంటారు.

Gold Ornament: మన దేశంలో బంగారంపై జనాల్లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసిడి ఆభరణాలను ధరించడమే కాదు.. దాన్ని పెట్టుబడిలా కూడా చూస్తుంటారు.

  • Published Jul 23, 2024 | 9:30 PMUpdated Jul 23, 2024 | 9:30 PM
బంగారు నగలు కొంటున్నారా? నష్టమే తప్ప లాభం లేదు.. ఈ ప్రభుత్వ గోల్డ్ స్కీం బెస్ట్!

మన దేశంలో బంగారంపై జనాల్లో ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసిడి ఆభరణాలను ధరించడమే కాదు.. దాన్ని పెట్టుబడిలా కూడా చూస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం మీద ఎక్కువ ఇష్టం చూపిస్తారు. మహిళలు అనే కాదు.. పురుషులు కూడా దీనిపై ఎక్కువ మక్కువ కనబరుస్తారు. కామన్ మ్యాన్ నుంచి రిచ్ పీపుల్ వరకు అందరూ బంగారంపై ఇష్టాన్ని చూపించడం తెలిసిందే. ఏదైనా కష్టం వస్తే ఇది ఆదుకుంటుందని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నమ్ముతాయి. అందుకే తమ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్​ను కొనుక్కోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. సంపన్నులు దీన్ని స్టేటస్ సింబల్​గా భావిస్తుంటారు.

ఎంత బంగారం ఉంటే అంత ధనవంతులు అనేది సొసైటీలో బలపడిపోయింది. అందుకే సంపన్నులు గోల్డ్​ను కొనుక్కొని ఈవెంట్స్​లో ధరించడం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ప్రజల నిత్య జీవనంలో గోల్డ్ అనేది ఓ భాగమైపోయింది. అయితే గోల్డ్ కొనాలనుకునే వారికి ఓ అలర్ట్. బంగారు నగలు కొంటే నష్టమే తప్ప, ఎలాంటి లాభం లేదు. దాని కంటే ఈ గవర్నమెంట్ గోల్డ్ స్కీమ్ బెస్ట్ అని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. ఇన్వెస్ట్​మెంట్ చేయాలనుకునే వారు బంగారు ఆభరణాలను కొనకపోవడమే బెటర్. ఎందుకంటే గోల్డ్ ఆర్నమెంట్స్​ విషయంలో విలువ పెరిగినా మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీతో పాటు ఒకవేళ బ్యాంకుల్లో దాస్తే అక్కడ కట్టే రెంట్ గట్రా కలుపుకొని తడిసి మోపెడవుతుందని నిపుణులు చెబుతున్నారు.

డబ్బు అవసరమై ఆ నగల్ని అమ్మితే ఆ రోజు రేట్​తో మీ దగ్గర ఉన్న గోల్డ్ వెయిట్​ను మల్టిప్లై చేస్తే వచ్చిన మొత్తాన్ని మాత్రమే మీకు అందిస్తారు. అంతేగానీ మీరు బంగారం కొనేటప్పుడు కట్టిన మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ, గోల్డ్ లాకర్ రెంట్ గట్రా కలుపుకొని మీకు చెల్లించరు. అందుకే ఇన్వెస్ట్​మెంట్ కోసమైతే బంగారు నగల్ని కొనకపోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ డబ్బుల్ని పెట్టుబడి పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ పథకమైన సవరిన్ గోల్డ్ బాండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి పూర్తిగా సేఫ్. ఇక్కడ మీకో బాండ్ ఇస్తారు. బంగారం ధర పెరిగితే బాండ్ విలువ కూడా పెరుగుతూ పోతుంది. దీని టెన్యూర్ 8 ఏళ్లు. గడువు ముగిశాక వాళ్లకు బాండ్ ఇస్తే ఆ రోజు బంగారం ధరను బట్టి అంత రిటర్న్ ఇస్తారు. అలాగే ప్రతి ఏడాది 2.5 శాతం వడ్డీని మీ బ్యాంక్ అకౌంట్​లో వేస్తుంటారు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.