iDreamPost
android-app
ios-app

Hindenburg: గతేడాది అదానీపై ఆరోపణలు.. ఇప్పుడు ఇంకో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్‌..!

  • Published Aug 10, 2024 | 11:28 AM Updated Updated Aug 10, 2024 | 11:28 AM

Hindenburg Research, India, Adani, Business News: 2023లో అదానీ గ్రూప్‌లో అవకతవకలు అంటూ.. సంచలన నివేదిక ప్రచురించిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ తాజాగా మరో బాంబు పేల్చింది. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hindenburg Research, India, Adani, Business News: 2023లో అదానీ గ్రూప్‌లో అవకతవకలు అంటూ.. సంచలన నివేదిక ప్రచురించిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ తాజాగా మరో బాంబు పేల్చింది. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 10, 2024 | 11:28 AMUpdated Aug 10, 2024 | 11:28 AM
Hindenburg: గతేడాది అదానీపై ఆరోపణలు.. ఇప్పుడు ఇంకో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్‌..!

హిండెన్‌బర్గ్‌ ఈ పేరు గతేడాది ఇండియలో మారుమోగిపోయిన విషయం తెలిసిందే. ఆ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది అదానీ. ఆయనకు గతేడాది నిద్రలేకుండా చేసింది హిండెన్‌బర్గ్‌ నివేదిక. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, భారీగా అప్పులు చేసి.. వాటిని ఆస్తులుగా చూపిస్తున్నారంటూ.. హిండెన్‌ బర్గ్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హిండెన్‌బర్గ్‌ దెబ్బకు అదానీ గ్రూప్‌ వేల కోట్ల నష్టాలను చవిచూసింది. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన చాలా మంది భారతీయులు కూడా నష్టాపోయారు. దీనిపై దేశం మొత్తం మాట్లాడుకుంది. పార్లమెంట్‌లో కూడా దీనిపై చర్చ జరిగింది. అలాగే సుప్రీం కోర్టు, సెబీ కూడా ఈ నివేదికపై స్పందించాయి. అంతలా దేశాన్ని కుదిపేసిన ఆ హిండెన్‌బర్గ్‌ సంస్థ.. తాజాగా మరో బాంబు పేల్చింది.

‘సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా’ అంటూ శనివారం ఉదయం ట్వీట్‌ చేసింది. ఇండియాలో త్వరలో ఏదో పెద్ద విషయం జరగబోతుందంటూ పేర్కొంది. దీంతో.. ఒక్కసారిగా పెట్టుబడి దారులు ఉలిక్కిపడ్డారు. నెత్తిన మరో పిడుగు పడబోతుందా అంటూ భయపడుతున్నారు. గతంలో అదానీ గ్రూప్‌ను టార్గెట్‌ చేసిన ఈ అమెరికాకు చెందిన సంస్థ ఇప్పుడు ఎవర్ని టార్గెట్‌ చేస్తుందో అంటూ భయపడుతున్నారు ఆర్థికవేత్తలు. అప్పట్లో అదానీ గ్రూప్‌ కంపెనీల తప్పుడు వ్యవహారాన్ని బయటపెట్టేందుకు తాము రెండేళ్లు శ్రమించినట్లు హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. మరి ఇప్పుడు పేల్చబోయే బాంబుకు ఎన్నేళ్లు శ్రమించిందో చూడాలి.

hinden berg research

ఈ హిండెన్‌బర్గ్‌ అంటే ఏంటి?
హిండెన్‌బర్గ్‌ అనేది ఒక ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ సంస్ఘ. ఇది అమెరికాలో ఉంది. తమకు పెట్టుబడి నిర్వహణ, పరిశ్రమల్లో దశాబ్దాల అనుభవం ఉందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈక్విటీ, క్రెడిట్‌, డెరివేటివ్స్‌లను పరిశీలిస్తూ ఉంటామని చెబుతోంది. అయితే.. అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై సెబీ(సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) హిండెన్‌ బర్గ్‌ను ఈ ఏడాది జూన్‌లో నివేదిక కోరింది. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగిన తర్వాత, సుప్రీం కోర్టు ఆదేశాలతో నివేదిక కోరింది. దానికి జూలై 1న హిండెన్‌బర్గ్‌ తమ వివరణను ఇచ్చింది. ఇప్పుడు ఎవరి నెత్తిన పిడుగు వేస్తుందో, ఏ కంపెనీ డొల్లతనన్నా బయటపెడుతుందో చూడాలి. మరి ఈ విషయంలో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.