iDreamPost
android-app
ios-app

17 సార్లు విఫలం.. పట్టు వదల్లేదు..చివరికి రూ.40వేల కోట్ల కంపెనీ..!

పోరాటం నుండి వెనక్కి తగ్గని వారిని మాత్రమే విజయం వరిస్తుంది అనడానికి మనం ఎన్నో ఉదారణలు చూశాం. అలా పోరాడి జీవితంలో సక్సెస్ ను రుచి చూసిన వారి జాబితోల షేర్ చాట్ ఫౌండర్ అంకుష్ సచ్‌దేవ ఉన్నారు. 17 సార్లు విఫలమైన.. చివరకు రూ.40 వేల కోట్ల కంపెనీకి అధిపతిగా మారాడు.

పోరాటం నుండి వెనక్కి తగ్గని వారిని మాత్రమే విజయం వరిస్తుంది అనడానికి మనం ఎన్నో ఉదారణలు చూశాం. అలా పోరాడి జీవితంలో సక్సెస్ ను రుచి చూసిన వారి జాబితోల షేర్ చాట్ ఫౌండర్ అంకుష్ సచ్‌దేవ ఉన్నారు. 17 సార్లు విఫలమైన.. చివరకు రూ.40 వేల కోట్ల కంపెనీకి అధిపతిగా మారాడు.

17 సార్లు విఫలం.. పట్టు వదల్లేదు..చివరికి రూ.40వేల కోట్ల కంపెనీ..!

ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అలానే చాలా మంది  తమ లభ్యం దిశగా పయనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు విఫలం కాగానే..తమ ప్రయత్నాన్ని విరమిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ లక్ష్యాన్ని అందుకునే వరకు ప్రయత్నాన్ని ఆపరు. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పట్టుదలకుండా శ్రమించి విజయం సాధిస్తారు. అలాంటి వారిని సమాజం గుర్తు పెట్టుకుంటుంది. ఆ జాబితాకు చెందిన వ్యక్తే అంకుష్. 17 సార్లు విఫలం అయినా పట్టు వదలక చివరికి రూ.40 వేల కోట్ల కంపెనీని నడిపిస్తోన్నాడు. మరి.. అతడి సక్సెస్ స్టోరీ  గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అంకుష్ సచ్ దేవా 2015లో ఐఐటీ కాన్పూర్ లో తన ఇంజినిరింగ్ పూర్తి చేశాడు. దీనికి ముందు అతను సోమర్‌విల్లే స్కూల్ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు.  ఇంజనీరింగ్ పూర్తైన తరువాత మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలో తన కెరీర్ ను ప్రారంభించాడు. అంకుష్ 2014 మే నుండి జూలై వరకు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌గా కూడా పనిచేశాడు. చాలా మంది యువత మాదిరిగానే అంకుష్ కూడా ఉద్యోగంపై ఆసక్తి లేదు. దీంతో తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు.

అయితే సొంత వ్యాపారాన్ని ప్రారంభించే క్రమంలో అతడు 17 సార్లు విఫలం అయ్యాడు. అంకుష్ సచ్‌దేవా తన బిజినెస్ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి 17 స్టార్టప్‌లలో ప్రయత్నించాడు. అయితే అతడి ఆలోచనకు విఫలం అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి అన్ని ప్రయత్నాలు విఫలమైనా కూడా అంకుష్ మాత్రం పట్టు వదల్లేదు. అంతేకాక 18వ సారి కూడా వ్యాపారం ప్రారంభించే ప్రయత్నం చేశాడు. ఈ సారి తన ఇద్దరు మిత్రులతో కలసి తన ఆలోచనను అమలులో పెట్టాడు. దీంతో 17 సార్లు విఫలమైన అంకుష్ నేడు వేల కోట్ల విలువైన కంపెనీని స్థాపించారు. అంకుష్ 18వ ప్రయత్నంలో తన ఇద్దరు ఐఐటీ స్నేహితుల సాయం తీసుకున్నాడు.

Sharechat fonder ankush sachdeva

ఫరీద్ అహ్సన్, భాను సింగ్‌లతో కలిసి షేర్‌చాట్ యాప్‌ను రూపొందించారు. ఫేస్‌బుక్,వాట్సాప్‌లలో కొత్తగా ఏదైనా కావాలని కోరుకునే కొంతమంది వినియోగదారుల కోసం వెతికారు. దీఈ క్రమంలోనే జనవరి 2015లో షేర్‌చాట్ మాతృ సంస్థ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించబడింది. దీని తర్వాత షేర్‌చాట్ అక్టోబర్ 2015లో స్థాపించబడింది. మొదట్లో ఇది హిందీ, మరాఠీ, మలయాళం,తెలుగు భాషలలో ప్రారంభించబడింది. కానీ నేడు మొత్తం 15 భాషల్లో ఈ షేర్ చాట్ అందుబాటులో ఉంది. అంకుష్ వ్యాపారం అమెరికా, యూరప్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. వారికి మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఇక వీరి ప్రధాన కార్యాలయం మాత్రం బెంగుళూరులో ఉంది. ప్రసుత్తం నేడు ఈ యాప్‌కు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. ఈ కంపెనీ వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కూడా ఇచ్చింది. షేర్‌చాట్ జూన్ 2022లో నిధులను పొందింది, కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 40 వేల కోట్లు) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. ప్రస్తుతం అంకుష్ ప్రస్తుతం షేర్‌చాట్‌లో సీఈవోగా పనిచేస్తున్నారు. మరి..అంకుష్…అన్ని సార్లు విఫలమైనా, ఏ ఒక్కసారి నిరుత్సాహానికి గురైనా ఈ ఘనత సాధించేవాడు కాదు. తెలివైన చాలా మంది యువత రెండు,మూడు ఫెయిల్యూర్లకే  నిరుత్సాహానికి గురై లక్ష్యాని వదిలేస్తున్నారు. అలాంటి యువత అంకుష్ సచిదేవాను ఆదర్శంగా తీసుకోవాలి. మరి.. అంకుష్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.