Keerthi
ప్రస్తుతుం భవన నిర్మాణలు పెరగడంతో.. మార్కెట్ లో ఇసుక ధర డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇక వీటి ధరలు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో.. ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఓ కొత్త మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఇకపై ఇసుక అవసరం లేకుండా నిర్మాణాలు చెపట్టవచ్చు. అదేలా అంటే..
ప్రస్తుతుం భవన నిర్మాణలు పెరగడంతో.. మార్కెట్ లో ఇసుక ధర డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇక వీటి ధరలు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో.. ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఓ కొత్త మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఇకపై ఇసుక అవసరం లేకుండా నిర్మాణాలు చెపట్టవచ్చు. అదేలా అంటే..
Keerthi
సాధారణంగా ఇళ్లు కట్టాలంటే చాలా డబ్బులతో కూడికున్న పని అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇళ్లు నిర్మాణ రంగంలో సిమెంట్ , ఇటుకులు ఐరెన్ తో పాటు.. ఇసుకకు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే ప్రస్తుత కాలంలో పట్టణీకరణ, భవన నిర్మాణలు క్రమంగా విస్తరించడంతో.. ఇక వాటి నిర్మాణ అవసరాల కోసం ఇసుక డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒక ట్రాక్టర్ ఇసుక 4 నుంచి 6 వేలు వరకూ ఉండటుంది. మరి మార్కెట్ లో ఇసుక ట్రాక్టర్ ఇసుక ధరలు భారీగా ఉండటంతో.. దీనికి ప్రత్యామ్నయం లేక కొనుగోలు చేయడం మానలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడే మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీంతో ఇకపై ఇసుక అవసరం లేకుండా నిర్మాణాలు చెపట్టవచ్చు. అదేలా అంటే..
ప్రస్తుతుం భవన నిర్మాణలు పెరగడంతో.. మార్కెట్ లో ఇసుక ధర డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇక వీటి ధరలు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో.. కాంక్రీట్ మిక్సింగ్‌లో ఇసుకకు ప్రత్యామ్నాయంగా మరేదైనా అందుబాటులొకి వస్తే అనే ఆలోచనతో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)కి చెందిన సెంటర్ ఫర్ సస్టయినబుల్ (సీఎస్టీ) శాస్త్రవేత్తలు పరిశోధన చేయడానికి ముందడుగు వేశారు. ఈ క్రమంలోనే రు. ఇసుకకు ‘ప్రత్యామ్నాయ మెటీరియల్’ను కనుగొన్నారు. కాగా, ఈ మెటీరియల్ కు ముడిపదార్థాలు కార్బన్ డై ఆక్సైడ్, తవ్వి తీసిన మట్టి, భవన నిర్మాణాల వ్యర్థాలు! మట్టి, నిర్మాణాల వ్యర్థాల్లోకి ప్రత్యేక పద్ధతుల ద్వారా కార్బన్‌డై ఆక్సైడ్‌ను మిక్స్ చేసి ఇసుకకు ప్రత్యామ్నాయ పదార్థాన్ని రూపొందించారు. కాగా, ఈ మెటీరియల్‌ను ఉపయోగిస్తే ఇసుక కన్నా 20-22 శాతం మేర నిర్మాణాల్లో అధిక దృఢత్వం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజ ఇసుకకు బదులుగా కొంత మేర ప్రత్యామ్నాయంగా ఈ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చునని, తద్వారా ఇసుక వాడకం తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఇక ఈ సరికొత్త ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా బాధ్యతలు వహిస్తున్నారు అలాగే, దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా తెలిపారు. ఇక ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఎందుకంటే.. కనీసం ఒక 2BHK ఇళ్లు నిర్మించాలంటే 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. కనుక ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే కొంత మేరకైన ఖర్చు తగ్గుతుంది. మరి, ఇకపై సహజ ఇసుకకు బదులుగా ప్రత్యామ్నాయంగా కొత్త మెటీరియల్ అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.