P Venkatesh
PM mudra yojana: మీకు అర్జెంటుగా డబ్బులు కావాలా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సులభంగానే రూ. లక్ష లోన్ అందిస్తోంది. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.
PM mudra yojana: మీకు అర్జెంటుగా డబ్బులు కావాలా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సులభంగానే రూ. లక్ష లోన్ అందిస్తోంది. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.
P Venkatesh
ఈ రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరం అయినప్పుడు చేతిలో ఏమీ ఉండదు. అప్పుడు ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుందామన్నా ఇచ్చే వారుండరు. దీంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంకుల్లో లోన్స్ కోసం ట్రై చేస్తుంటారు. అయితే బ్యాంకులు షూరిటీ, డాక్యుమెంట్స్, ఖాతా వివరాలు అన్నీ సరిచూసుకున్నాక అర్హతను బట్టి లోన్ మంజూరు చేస్తుంటాయి. దీనికి టైం ఎక్కువ పట్టొచ్చు. ఇలాంటి టైమ్ లో ఈజీగా లోన్ మంజూరైతే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సులభంగా రూ. లక్ష లోన్ అందిస్తున్నది. దీన్ని ఎలా పొందొచ్చంటే?
ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఖాతాదారులు ఈజీగా రూ. లక్ష రూపాయల లోన్ పొందొచ్చు. అకౌంట్ తెరిచి 6 నెలలు పూర్తై ఉండాలి. ఎస్బీఐ అందించే ప్రధాన మంత్రి ముద్రా లోన్స్ ద్వారా లక్ష పొందొచ్చు. ఎస్‌బీఐ ప్రస్తుతం ఇ-ముద్రా లోన్స్ సైతం జారీ చేస్తోంది. ముద్రా లోన్ కోసం ఎలాంటి షూరిటీ అవవసరం లేదు. చాలా తక్కువ పత్రాలతో, తక్కువ వడ్డీకే లోన్ అందిస్తోంది. అయితే ఈ లోన్ పొందేందుకు కస్టమర్లు మైక్రో ఎంట్రప్రెన్యూర్ అయి ఉండాలి. ఇ-ముద్రా లోన్స్ ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్ గరిష్టంగా రూ. 1 లక్ష వరకు లోన్ ఇస్తోంది. లోన్ పొందిన తర్వాత 5 సంవత్సరాల కాల పరిమితిలోపు తిరిగి చెల్లించాలి.
లోన్ పొందాలనుకునే కస్టమర్లు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నంబర్, వ్యాపారానికి సంబంధించిన వివరాలు, ఆధార్ నంబర్, కమ్యూనిటీ వంటి తదితర వివరాలను బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. ఇ-ముద్రా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారు, ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ముద్రా లోన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్‌బీఐ ముద్రా లోన్ గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు పొందవచ్చు. మరి మీరు కూడా లక్ష రూపాయల లోన్ కావాలనుకుంటే ఎస్బీఐ అందించే ముద్రా లోన్ కోసం అప్లై చేసుకుని పొందొచ్చు.