iDreamPost
android-app
ios-app

కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీ ప్రకటించిన SBI

హోమ్ లోన్ కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీలను ప్రకటించింది.

హోమ్ లోన్ కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీలను ప్రకటించింది.

కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ రాయితీ ప్రకటించిన SBI

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ఓ కల. సొంతింట్లో ఉండే ఆనందం రెంట్ కు ఉండే ఇంట్లో దొరకదు. అద్దె ఇళ్లలో ఓనర్స్ పెట్టే ఆంక్షలతో భయంభయంగానే గడపాల్సి ఉంటుంది. అంతేగాక ఇంటి అద్దె కోసం డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఈ కారణాలతో అందరు సొంత గృహం కోసం ఆలోచిస్తుంటారు. సొంతిల్లు నిర్మించుకునేందుకు అహర్నిశలు కష్టపడి పైసా పైసా పోగేసుకుంటుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కూడబెట్టిన డబ్బు సొంతిల్లు కోసం సరిపోకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఎక్కువ మంది లోన్ తీసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇలా హోమ్ లోన్ కోసం ఎదురు చూసే కస్టమర్లకు ఎస్బీఐ అదిరి పోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లపై భారీగా రాయితీలను ప్రకటించింది.

సొంతిల్లు నిర్మించుకోవాలన్నా, లేదా కొనుగోలు చేయాలన్నా తమ వద్ద ఉన్న డబ్బు సరిపడనప్పుడు కస్టమర్లు బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటారు. తమ వద్ద ఉన్న డబ్బును డౌన్ పేమెంట్ గా కట్టి మిగతా సొమ్మును హోమ్ లోన్ రూపంలో తీసుకుంటారు. అయితే ఈ గృహ రుణాలపై బ్యాంకులు అధిక వడ్డీలను వసూలు చేస్తుంటాయి. దీని వల్ల కస్టమర్లు హోమ్ లోన్స్ తీసుకునేందుకు వెనకాముందు ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి భారతీయ స్టేట బ్యాంక్ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. హోమ్ లోన్ల వడ్డీ రేట్లపై భారీ రాయితీలు ప్రకటించింది. ఎస్బీఐలో గృహ రుణం తీసుకునే వారికి ఏకంగా 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీలో రాయితీ అందిస్తోంది.

కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగానే వడ్డీ రేట్లపై రాయితీని నిర్ణయించింది. ఈ బెనిఫిట్ అనేది రెగ్యులర్ హోమ్ లోన్ సహా ఫ్లెక్సీ పే, నాన్ శాలరీడ్, ఎన్ఆర్ఐ, ప్రివిలేజ్, అపార్ ఘర్ లకు సైతం వర్తిస్తుందని ఎస్‌బీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఎస్బీఐ ప్రకటించిన ఈ ఆఫర్ తో లోన్ పొంది మీ సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. కాగా తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందేందుకు డిసెంబర్ 31, 2023 వరకే అవకాశం కల్పించింది. హోమ్ లోన్ కావాలనుకునే వారు ఆలస్యం చేయకుండా త్వరపడండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9.15 శాతంగా ఉంది. మరి ఎస్బీఐ ప్రకటించిన హోమ్ లోన్ వడ్డీ రేట్ల రాయితీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎస్‌బీఐలో హోమ్ లోన్ల వడ్డీ రేట్లపై రాయితీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎస్బీఐ ఖాతాదారుల సిబిల్ స్కోర్ 750- 800 వరకు ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటులో 55 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ వస్తుంది. దీంతో వారికి రాయితీ తర్వాత కేవలం 8.60 శాతం వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది.
  • సిబిల్ స్కీర్ 700- 749 మధ్య ఉంటే వారికి ఏకంగా 65 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ లభిస్తుంది. దీంతో వారికి 8.70 శాతం వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది.
  • సిబిల్ స్కోర్ 650- 699 మధ్య ఉంటే వారికి ఎలాంటి రాయితీ వర్తించదనే చెప్పాలి. వీరికి 9.45 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
  • సిబిల్ స్కోరు 550 నుంచి 649 మధ్య ఉంటే వారికి 9.65 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
  • సిబిల్ స్కోర్ 151- 200 మధ్య ఉన్నవారికి ఈ ఆఫర్ పీరియడ్ లో ఏకంగా 65 బేసిస్ పాయింట్ల మేర రాయితీ కల్పిస్తోంది. వారికి హోమ్ లోన్ వడ్డీ రేటు 8.70 శాతంగా ఉంటుంది.
  • సిబిల్ స్కోర్ 101- 150 మధ్య ఉన్నట్లయితే వారికి ఎలాంటి రాయితీ లభించదు. వారికి వడ్డీ రేటు 9.45 శాతంగా ఉంటుంది.