iDreamPost
android-app
ios-app

SBI: న్యూ ఇయర్ కు ముందు SBI గుడ్ న్యూస్.. ఏంటంటే?

  • Published Dec 21, 2023 | 9:47 PM Updated Updated Dec 21, 2023 | 9:47 PM

ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరానికి ముందు తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరానికి ముందు తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

SBI: న్యూ ఇయర్ కు ముందు SBI గుడ్ న్యూస్.. ఏంటంటే?

కొత్త సంవత్సరానికి ముందు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను, అద్భుతమైన ఆఫర్లను తమ ఖాతాదారుల కోసం తీసుకొచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పలు మార్లు పొడిగించుకుంటూ వచ్చిన ఓ స్కీమ్ లాస్ట్ డేట్ ను మరోసారి ఎక్స్ టెన్షన్ చేసింది. చివరి తేదీని 2024, మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఇంతకీ ఎస్ బీఐ న్యూ ఇయర్ ముందు చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరానికి ముందు తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పలు మార్లు పొడిగించుకుంటూ వచ్చిన SBI స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్-అమృత్ కలశ్ గడువును మరోసారి పెంచింది. ఈ స్కీమ్ ను 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తన అధికారిక వెబ్ సైట్లో వివరాలను వెల్లడించింది. సాధారణ డిపాజిట్ల కంటే అమృత్ కలశ్ స్కీమ్ లో వడ్డీ ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు.

good nes for sbi customers

ఇదిలా ఉండగా.. 2023 ఏప్రిల్ లో ఈ స్కీమ్ ను రీఇంట్రడ్యూస్ చేసి తొలుత జూన్ 30 వరకు చివరి తేదీని ఉంచింది. ఈ తేదీని తర్వాత ఆగస్ట్ 15 వరకు పొడిగించింది. మధ్యలో డిసెంబర్ 31 వరకు పెంచి.. మళ్లీ ఇప్పుడు మార్చి 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం బ్యాంక్ నుంచి అందుబాటులో ఉన్న ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఇది మంచి స్కీమ్. దీని టెన్యూర్ 400 రోజులు ఉంది. ఈ పథకంలో జనరల్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఈ స్కీమ్ ను బ్యాంక్ కు డైరెక్ట్ గా వెళ్లి ప్రారంభించొచ్చు. లేదా యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా స్టార్ట్ చేయెుచ్చు. ఇక ఈ స్కీమ్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ను సంప్రదించండి.