iDreamPost
android-app
ios-app

సుబ్రతా రాయ్ మరణం.. ఆ 25 వేల కోట్ల మాటేంటి..?

ప్రముఖ వ్యాపార సంస్థ సహారా గ్రూప్స్ అధినేత సుబ్రతా రాయ్ మంగళవారం గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. అయితే ఆయనకు సంబంధించిన రెండు కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ.. కొన్ని సంవత్సరాల క్రితం సెబీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పుడు

ప్రముఖ వ్యాపార సంస్థ సహారా గ్రూప్స్ అధినేత సుబ్రతా రాయ్ మంగళవారం గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. అయితే ఆయనకు సంబంధించిన రెండు కంపెనీల్లో అవకతవకలు జరిగాయంటూ.. కొన్ని సంవత్సరాల క్రితం సెబీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పుడు

సుబ్రతా రాయ్ మరణం.. ఆ 25 వేల కోట్ల మాటేంటి..?

ఇప్పుడంటే పలు చిట్స్ ఫండ్స్ సంస్థలున్నాయి కానీ.. 1970వ దశకంలో అటువంటి సంస్థకు నాంది పలికింది సహారా గ్రూప్. 1976లో సహారా ఫైనాన్స్ చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసి.. ఆ తర్వాత అనేక వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి.. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు స్పాన్సర్‌గా వ్యహరించే స్థాయికి ఎదిగింది ఆ సంస్థ. దాని వెనుక ఎనలేని కృషి చేసిన వ్యక్తి సుబ్రతా రాయ్. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, ఆతిథ్య రంగాల్లో వ్యాపారాలు చేసి తన పేరును, సంస్థ పేరును ఓ బ్రాండ్‌గా మలిచారు. ఈ దిగ్గజ వ్యాపారి 75 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన మరణంతో ఓ అంశం తెరపైకి వచ్చింది. అదే సెబీ వద్ద పంపిణీ చేయకుండా ఉన్న రూ. 25వేల కోట్ల నిధుల సంగతేంటన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.

ఇంతకు ఆ 25 వేల కోట్ల రూపాయల నిధులు మ్యాటరేంటంటే..? సుబ్రతారాయ్‌కు చెందిన రెండు సంస్థలు నిబంధనలు అతిక్రమించినట్లు 2011లో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్కూరిటీస్ ఎక్చ్సేంచీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. ఆరోపణలు చేసింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు కొన్ని స్కీంలతో నిబంధనలు అతిక్రమించినట్లు పేర్కొంది. బాండ్ల ద్వారా సుమారు 3 కోట్ల మంది పెట్టుబడి దారుల నుండి డబ్బులు సేకరించిందని, వాటిని రిఫండ్ చేయాలని ఆదేశించింది సెబీ. అయితే సెబీ ఆరోపణలు వ్యతిరేకిస్తూ.. ఆయన పోరాటం చేశారు. ఈ సమయంలో ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో సెబీ ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సహారాకు చెందిన ఆ రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు 15 శాతం వడ్డీతో తిరిగి నగదు చెల్లించాలని పేర్కొంది. 95 శాతానికి పైగా పెట్టుబడిదారులకు రిఫండ్ చేసినట్లు గ్రూప్ వెల్లడించింది. అయితే పెట్టుబడి దారులు సెక్యూరిటీ నేపథ్యంలో.. డిపాజిట్ కింద సెబీ వద్ద రూ. 24 వేల కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. 11 ఏళ్ల తర్వాత సదరు సంస్థ ఇన్వెస్టర్లకు సుమారు రూ. 138.07 కోట్లు రీఫండ్ చేసినట్లు సమాచారం. అందులో వడ్డీ రూ. 67.98 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు సెబీ ప్రత్యేకంగా తెరిచిన బ్యాంక్ ఖాతాలో రూ. 24వేల కోట్లు జమ చేయగా.. ఇప్పుడు అవి రూ. 25 వేల కోట్లకు చేరుకున్నాయి. ఇక మిగిలిన దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వాటిని తిరస్కరించింది సెబీ. ఇప్పుడు సుబ్రతా రాయ్ మరణంతో మరో సారి ఆ రూ. 25వేల కోట్లు వార్తల్లోకి వచ్చాయి.