P Venkatesh
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ ఖాతాకు సంబంధించి ఏవైనా పనులుంటే ఇప్పుడే చేసుకోండి.
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. మీ ఖాతాకు సంబంధించి ఏవైనా పనులుంటే ఇప్పుడే చేసుకోండి.
P Venkatesh
ఈ ఏడాది మరో నెల కాలగమనంలో కలిచిపోనున్నది. ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనున్నది. కొత్త నెల ప్రారంభం అవుతుందంటే చాలు ఎన్నో మార్పులు సంబవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వచ్చే మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ఏకంగా మే నెలలో దాదాపు సగం రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి. వచ్చే నెలలో బ్యాంక్‌లకు మొత్తం 12 హాలిడేస్ వచ్చాయి. వీటిలో 2 &4 శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారతాయనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.
మీకు ఏవైనా బ్యాంకు పనులు ఉన్నట్లైతే బ్యాంకులు ఏరోజుల్లో పనిచేస్తాయో ముందుగానే తెలుసుకుంటే మంచిది. బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు చాలా వరకు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నప్పటికీ కొన్ని పనులకు బ్యాంకులకు వెళ్లాల్సిందే. అంటే.. ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ వంటి ఇతర అవసరాల కోసం నేరుగా బ్యాకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి వచ్చే మేనెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు.. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.