nagidream
RBI Good News: యూపీఐ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ లైట్ లో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
RBI Good News: యూపీఐ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ లైట్ లో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
nagidream
ప్రస్తుతం భారతదేశం డిజిటల్ ఇండియాగా దూసుకుపోతుంది. దేశంలో చాలా మంది డిజిటల్ పేమెంట్సే చేస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో ప్రపంచదేశాలకు భారత్ గట్టి పోటీనిస్తుంది. 2016లో నోట్ల రద్దు తర్వాత ఎన్పీసీఐ సహకారంతో భారత ప్రభుత్వం యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ రాకతో దేశంలో చిల్లర సమస్య తీరింది. అయితే యూపీఐ పేమెంట్స్ అనేవి ఇంటర్నెట్ ఉంటేనే అవుతాయి. నెట్ వర్క్ సరిగా లేకపోతే పేమెంట్స్ అనేవి జరగవు. నెట్ వర్క్ సరిగా లేని గ్రామీణ ప్రాంతాల్లో, నెట్ వర్క్ తక్కువగా ఉండే ఏరియాల్లో సైతం ఆన్ లైన్ పేమెంట్స్ సులువుగా అయ్యేలా ఎన్పీసీఐ.. అప్ యూపీఐ లైట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
యూపీఐ లైట్ అనేది ఒక యూపీఐ వ్యాలెట్. ఈ వ్యాలెట్ ద్వారా నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చు. ఈ యూపీఐ లైట్ ద్వారా చేసే పేమెంట్స్ కి పిన్ అవసరం లేదు. ఈ వ్యాలెట్ లో గరిష్టంగా 2 వేల వరకూ నగదు లోడ్ చేసుకోవచ్చు. ఒకరోజులో 2 వేల రూపాయల వరకూ లావాదేవీలు జరపవచ్చు. ఒకరోజులో 500 వరకూ మాత్రమే పేమెంట్ చేయవచ్చు. అయితే యూపీఐ లైట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. యూపీఐ లైట్ విధానాన్ని మరింత విస్తృతపరిచేందుకు ఈ-మ్యాండేట్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. యూపీఐ లైట్ లో లిమిట్ కంటే బ్యాలన్స్ తగ్గితే కనుక ఆటోమేటిక్ గా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు లోడ్ అవుతాయని.. ఈ లిమిట్ ని యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రికరింగ్ చెల్లింపులకు ఈ-మ్యాండేట్ వాడకం పెరిగిందని.. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటికి కూడా ఆటో లోడ్ సదుపాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. వినియోగదారులు సెట్ చేసుకున్న పరిమితి కంటే నిధులు తగ్గితే కనుక వెంటనే ఈ-మ్యాండేట్ సదుపాయం ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ గా ఫండ్స్ లోడ్ అవుతాయని అన్నారు. దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా చెల్లింపులు, లావాదేవీలు జరుగుతాయని తెలిపారు.