iDreamPost
android-app
ios-app

ఖాతాదారులకు అలర్ట్.. జూన్ లో బ్యాంకు సెలవులివే.. మొత్తం ఎన్ని రోజులంటే?

బ్యాంకులకు జూన్ నెలకు సంబంధించిన సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆయా తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మొత్తం ఎన్ని రోజులంటే?

బ్యాంకులకు జూన్ నెలకు సంబంధించిన సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆయా తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మొత్తం ఎన్ని రోజులంటే?

ఖాతాదారులకు అలర్ట్.. జూన్ లో బ్యాంకు సెలవులివే.. మొత్తం ఎన్ని రోజులంటే?

మరికొన్ని రోజుల్లో మే నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. ఇంకొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతున్నది. వచ్చే నెలలో బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బ్యాంకు సెలవుల నేపథ్యంలో ఖాతాదారులు ఏవైనా బ్యాంకు పనులుంటే సెలవు రోజులను ముందుగానే తెలుసుకుంటే సమయం వృథా కాకుండా చూసుకోవచ్చు. అదే విధంగా ఆర్థికంగా కూడా నష్ట పోకుండా చూసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ సేవలు చాలా వరకు ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఖాతాకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్, డెబిట్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి వచ్చే నెల జూన్ లో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయంటే?

ఆర్బీఐ జూన్ నెలకు సంబంధించిన సెలవులను వెల్లడించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్ లైన్ సేవలు కొనసాగుతాయి. జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఏయే తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయంటే?

జూన్ లో బ్యాంక్ సెలవుల తేదీలు:

  • జూన్ 2- ఆదివారం, బ్యాంకులకు సెలవు.
  • జూన్ 9- ఆదివారం, మహారాణా ప్రతాప్ జయంతి,హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్
  • జూన్ 10- సోమవారం, శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం,పంజాబ్
  • జూన్ 14 – శుక్రవారం, పహిలి రాజా, ఒరిస్సా
  • జూన్ 15 – శనివారం – రాజా సంక్రాంతి, ఒరిస్సా
  • జూన్ 16 -ఆదివారం
  • జూన్ 17 – సోమవారం, బక్రీద్
  • జూన్ 21- శుక్రవారం, వట్ సావిత్రి వ్రతం, అనేక రాష్ట్రాలు
  • జూన్ 22- శనివారం,సంత్ గురు కబీర్ జయంతి
  • జూన్- 23 ఆదివారం
  • జూన్ 30- ఆదివారం, దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు. ఈరోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.