iDreamPost
android-app
ios-app

Jio దీపావళి ఆఫర్.. కేవలం రూ. 699కే జియో భారత్ 4G ఫోన్లు

JioBharat 4G Phones: రిలయన్స్ జియో దీపావళి పండగ వేళ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. జియో భారత్ ఫోన్లను రూ. 699కే అందించనున్నట్లు ప్రకటించింది.

JioBharat 4G Phones: రిలయన్స్ జియో దీపావళి పండగ వేళ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. జియో భారత్ ఫోన్లను రూ. 699కే అందించనున్నట్లు ప్రకటించింది.

Jio దీపావళి ఆఫర్.. కేవలం రూ. 699కే జియో భారత్ 4G ఫోన్లు

రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల జియో భారత్ పేరిట 4జీ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చౌక ధరలకే 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఈ మొబైల్స్ కు ఫుల్ డిమాండ్ వచ్చింది. స్పెసిఫికేషన్స్ కూడా క్రేజీగా ఉండడంతో యూజర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జియో భారత్ పేరిట ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టి గ్రామీణ ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ నేపథ్యంలో సేల్స్ ను పెంచుకునేందుకు జియో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ వేళ జియో భారత్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ కింద అతి తక్కువ ధరకే 4జీ ఫీచర్ ఫోన్లను అందిస్తోంది.

ఇప్పటి వరకు జియో భారత్ 4జీ ఫోన్ల ధరలు రూ. 999గా ఉండేది. దీపావళి ఆఫర్ లో భాగంగా వీటిని రూ. 699కే కొనుగోలు చేయొచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్ మాత్రం పరిమితకాలమే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఫోన్ల కోసం ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్స్ ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్లు జియో సిమ్ కార్డ్ తో మాత్రమే పనిచేస్తాయి. రిలయన్స్ స్టోర్, అమెజాన్ లో జియో భారత్ 4జీ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇటీవల జియో భారత్ మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. జియోభారత్‌ V3, జియోభారత్‌ V4 పేరుతో 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.

ఈ ఫోన్ల ధర కేవలం రూ. 1099 మాత్రమే. ఈ ఫీచర్ ఫోన్లలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూపీఐ పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. లైవ్ టీవీ చానల్స్ ను చూడొచ్చు. జియోభారత్‌ V3, V4 ఫీచర్‌ఫోన్‌లు జియోఛాట్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. దీనితో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ మెసెజ్‌, ఫోటో షేరింగ్‌, గ్రూప్‌ మెసేజింగ్‌ ఆప్షన్‌లను పొందవచ్చు. ఈ రెండు ఫోన్‌లు 1000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు జియోటీవీ యాప్‌ను సపోర్టు చేస్తాయి. 455 లైవ్‌ టీవీ ఛానళ్లు వీక్షించేందుకు వీలుంటుందని జియో తెలిపింది.

వినియోగదారులు తమకు ఇష్టమైన షోలు, వార్తలు, క్రీడలను ఆస్వాదించవచ్చు. అలాగే.. ఈ ఫోన్‌లు జియోపే యాప్‌ సపోర్టును కలిగి ఉంటాయి. ఫలితంగా యూపీఐ పేమెంట్‌లు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ల కోసం జియో భారత్ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లకు రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ తో 28 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్, 14జీబీ డేటా వస్తుంది. మరి దీపావళి ధమాకా ఆఫర్ కింద రూ. 699కే జియో భారత్ ఫీచర్ ఫోన్లను అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.