iDreamPost
android-app
ios-app

HYDలో మరో మాదాపూర్‌గా మారనున్న ఏరియాలు! ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం!

  • Published Jun 07, 2024 | 5:03 PM Updated Updated Jun 07, 2024 | 5:03 PM

These Areas Becomes Another Madhapur: హైదరాబాద్ లో ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో రేట్లు ఎంత తక్కువగా ఉండేవో అందరికీ తెలిసిందే. అసలు రియల్ ఎస్టేట్ లేని సమయంలో అక్కడ ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టీట్ బూమ్ అందుకున్నాక చాలా మంది కోటీశ్వరులు అయిపోయారు. అప్పుడు మిస్ అయినవారు ఇప్పుడు కోటీశ్వరులు అవ్వడానికి మరో అవకాశం వచ్చింది.

These Areas Becomes Another Madhapur: హైదరాబాద్ లో ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో రేట్లు ఎంత తక్కువగా ఉండేవో అందరికీ తెలిసిందే. అసలు రియల్ ఎస్టేట్ లేని సమయంలో అక్కడ ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టీట్ బూమ్ అందుకున్నాక చాలా మంది కోటీశ్వరులు అయిపోయారు. అప్పుడు మిస్ అయినవారు ఇప్పుడు కోటీశ్వరులు అవ్వడానికి మరో అవకాశం వచ్చింది.

HYDలో మరో మాదాపూర్‌గా మారనున్న ఏరియాలు! ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం!

హైదరాబాద్ సిటీలో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. గజం కొనాలంటే కనీసం లక్ష రూపాయలైనా పెట్టాల్సిందే. కూకట్ పల్లి, మియాపూర్ వంటి ఏరియాల్లో ఇవే ధరలు ఉన్నాయి. ఇక మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో కొనాలంటే అసలు ఆ ఊహే కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు స్థలం కొంటే ఫ్యూచర్ లో మీకు మాదాపూర్ లాంటి ఏరియాలో స్థలం ఉంటుంది. అదేనండి.. మీరు ఇప్పుడు స్థలం మీద పెట్టుబడి పెట్టే ఏరియా ఏదైతే ఉందో అది.. ఫ్యూచర్ లో మరో మాదాపూర్ గా మారనుంది. అదొక్కటే కాదు అలాంటి ఇంకో ప్రాంతం కూడా మరో మాదాపూర్ ని తలపించనుందని నిపుణులు అంటున్నారు. పైగా హైదరాబాద్ సిటీ నుంచి కనెక్టివిటీ అనేది మెరుగవుతుంది. కాబట్టి సిటీలోకి రావడానికి ఈజీగా ఉంటుంది.

పాతబస్తీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో అలైన్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి అవుటర్ లో ఉన్న విమానాశ్రయానికి మెట్రోను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ ఉన్న ప్రాంతాల్లో ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి మోకిలా, శంకరపల్లి ఏరియాలపై పడింది. శంకరపల్లి ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళింది. ఇక్కడ గజం స్థలం రూ. 22 వేల నుంచి రూ. 30 వేల రేంజ్ లో ఉన్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాలు అయితే ఈ రేటు డబుల్ ఉంటుంది. శంకరపల్లి నుంచి కోకాపేటకు 20 కి.మీ. దూరంలో డబుల్ రోడ్డు వస్తుంది.

ఇక మోకిలా చూసుకుంటే ఇక్కడ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాస్ చాలా ఉన్నాయి. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రీ-స్కూల్స్ ఉన్నాయి. పలు ఎంటర్టైన్మెంట్ జోన్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ప్రాంతంలో ఇటీవలే ఓ పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది.ఈ ఏరియాలో కూడా గజం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గజం మీద ఫ్యూచర్ లో 80 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్ లో ఇక్కడ మెట్రో కనెక్టివిటీ కూడా వస్తుంది కాబట్టి ఈ ఏరియాలకు తిరుగుండదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాలు మరో మాదాపూర్ గా అభివృద్ధి చెందనున్నాయని అంటున్నారు.