iDreamPost
android-app
ios-app

బ్యాంకులకు RBI తీవ్ర హెచ్చరిక.. ఆ పని వెంటనే చేయాలని ఆదేశం!

  • Published Mar 18, 2024 | 3:45 PM Updated Updated Mar 18, 2024 | 3:45 PM

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బ్యాకింగ్ రంగాలో సైబర్ క్రైం దాడులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఫ్ ఇండియా కొన్ని  బ్యాంకులకు తీవ్ర హెచ్చరికలు చేసింది. త్వరలో బ్యాంకుల్లో ఈ పనిని పూర్తి చేయాలని లేదంటే భారీగా సైబర్ దాడులు జరిగే ఆవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా బ్యాకింగ్ రంగాలో సైబర్ క్రైం దాడులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఫ్ ఇండియా కొన్ని  బ్యాంకులకు తీవ్ర హెచ్చరికలు చేసింది. త్వరలో బ్యాంకుల్లో ఈ పనిని పూర్తి చేయాలని లేదంటే భారీగా సైబర్ దాడులు జరిగే ఆవకాశం ఉందని హెచ్చరించింది.

  • Published Mar 18, 2024 | 3:45 PMUpdated Mar 18, 2024 | 3:45 PM
బ్యాంకులకు RBI తీవ్ర హెచ్చరిక.. ఆ పని వెంటనే చేయాలని ఆదేశం!

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సైబర్ క్రైం దాడులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈ సైబర్ దాడులు అనేవి బ్యాకింగ్ రంగాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులనే ఈ సైబర్ కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి వివిధ రకాల సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల పేరిట మెయిల్ లను పంపిస్తున్నారు. వాటిని ఏమాత్రం ఏమరు పాటుగా తెరచి చూసిన ఆయా సంస్థలకు సంబంధించిన డేటా అనేది సైబర్ నేరాగాళ్ల చేతికి చిక్కుతుంది. దీంతో కోట్ల రూపాయలు ఆయా బ్యాంకులకు టోకా పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే తాజాగా ఈ విషయం పై రిజర్వ్ బ్యాంక్ ఫ్ ఇండియా కొన్ని  బ్యాంకులకు తీవ్ర హెచ్చరికలు చేసింది. త్వరలో బ్యాంకుల్లో ఈ పనిని పూర్తి చేయాలని లేదంటే భారీగా సైబర్ దాడులు జరిగే ఆవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు బ్యాంకుల పని తీరు, వాటి భద్రతపై నిఘా వేస్తు ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బ్యాంకులకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్నట్లు తీవ్ర హెచ్చరికలు చేసింది. కాగా, వాటిని ఎదుర్కొనేందుకు వెంటనే సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నాంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే.. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్జామినేషన్ (CSITE) సిఫార్సుల మేరకు బ్యాంకులకు హెచ్చరికలు పంపించింది. అలాగే తమ తనిఖీల్లో లోపాలు గుర్తించిన ప్రతి చోటా ఆర్‌బీఐ యాక్షన్ పాయింట్లను కూడా అందించింది. ఇక ఈ విషయంలో సీఎస్ఐటీఈ అనేది ఆర్‌బీఐకి అనుబంధంగా పని చేస్తుంది. ఈ క్రమంలోనే వివిధ బ్యాంకులు ఎదుర్కొనే ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్స్ సామర్థ్యాలు, మోసాలన సామర్థ్యలను అంచనా వేసేందుకు ఇది సహాయం చేస్తుంది. అలాగే, అన్ని బ్యాంకుల ఐటీ సిస్టమ్స్ లో లోతైనా పరిశీలన పర్యవేక్షణను చేస్తున్నాయి ఈ బృందాలు.

RBI warning to banks

సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ప్రతి ఏటా నిర్వహించిన యాన్యువల్ రిస్క్ అసెస్మెంట్ తనిఖీలకు సీఎస్ఐటీఈ అనేది వేరుగా ఉంటుంది. ఇది బ్యాంకులపై నిఘా పెంచే క్రమంలో ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ ప్రారంభించింది ఆర్‌బీఐ. కనుక ఇక నుంచి అన్నీ బ్యాంకుల్లోని సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల్లో ఉన్న లోపాలను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. అలాగే ఈ సారి ఎక్కడ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ కొన్ని యాక్షన్ పాయింట్లు కూడా అందించిందిని ఓ ఓ బ్యాంక్ పేర్కొన్నట్లు మనీకంట్రోల్ పేర్కొంది. ఇక ఈ విషయంపై ఆర్‌బీఐకి ఇ-మెయిల్ పంపించగా ఎలాంటి సమాధానం రాలేదని తన కథనంలో తెలియజేసేంది.

అంతేకాకుండా.. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రాబి శంకర్ గతనెల ఫిబ్రవరి 9 వ తేదీన కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా అందులో బ్యాంకింగ్ సెక్టార్ సరికొత్త సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇక కస్టమర్ల సౌకర్యం సహా ఇతర అంశాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, అలాగే మెరుగైన సౌకర్యాలను అందించాలని.. ఈ మేరకు ముంబైలో జరిగిన 19 వ బ్యాంకింగ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. దీంతో పాటు బ్యాంకులు తమ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, లోపాలు గుర్తించిన వాటిని సరి చేసుకోవాలని తెలిపారు.