iDreamPost
android-app
ios-app

Cibil స్కోర్ విషయంలో RBI కీలక నిర్ణయం.. ఇకపై 15 రోజులకు ఒకసారి!

RBI New Rules Regarding Cibil Score Fast Report: లోన్స్ తీసుకోవాలి అన్నా.. కొత్త క్రెడిట్ కార్డు కావాలి అన్నా వినియోగదారుల నుంచి బ్యాంకులు ఒక విషయాన్ని అయితే కచ్చితంగా తెలుసుకుంటాయి. అదే సిబిల్ స్కోర్. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

RBI New Rules Regarding Cibil Score Fast Report: లోన్స్ తీసుకోవాలి అన్నా.. కొత్త క్రెడిట్ కార్డు కావాలి అన్నా వినియోగదారుల నుంచి బ్యాంకులు ఒక విషయాన్ని అయితే కచ్చితంగా తెలుసుకుంటాయి. అదే సిబిల్ స్కోర్. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

Cibil స్కోర్ విషయంలో RBI కీలక నిర్ణయం.. ఇకపై 15 రోజులకు ఒకసారి!

క్రెడిట్ కార్డులు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడం ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. ఎంత సేవింగ్స్ ఉన్నా కూడా.. ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కచ్చితంగా ఉంటుంది. అయితే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. అలాగే అంత ఈజీ కూడా కాదు. ఒక్కోసారి మీరు తీసుకునే లోన్ ని బట్టి నెలలు తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ లోన్స్ కి సంబంధించి పేపర్ వర్క్ ముందుకు సాగాలి అంటే.. ముందుగా బ్యాంకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీ సిబిల్ స్కోర్ ఎంత? అని. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టే మీ అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ విషయంలోనే ఆర్బీఐ గవర్నర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పారు.

సిబిల్ స్కోర్ అనేది లోన్స్ విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోర్ ప్రతి నెలకు ఒకసారి అప్ డేట్ అవుతూ ఉంటుంది. అయితే మీ సిబిల్ స్కోర్ మెరుగయ్యాక లోన్ తీసుకుందాం అని వెయిట్ చేస్తే అందుకు కనీసం నెల రోజులు ఆగాల్సిందే. ఇది గతంలో మాట. ఇప్పుడు ఆర్బీఐ తెచ్చిన రూల్ ప్రకారం త్వరిత గతిన వినియోగదారుల సిబిల్ స్కోర్ అప్ డేట్ కానుంది. అంటే కనీసం 15 రోజులకు ఒకసారి మీరు మీ అప్ డేటెడ్ సిబిల్ స్కోర్ ని పొందవచ్చు. ఈ నిర్ణయం వల్ల.. లోన్స్ తీసుకునే వారికి కచ్చితంగా మేలు జరుగుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్ డేట్ గా ఉంటే బ్యాంకుల నుంచి మంచి లోన్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ లను త్వరిత గతిన అప్ డేట్ చేయాలి అని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజులకు ఒకసారి మీరు మీ అప్ డేటెడ్ సిబిల్ స్కోర్ పొందవచ్చు. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి వినియోగదారుల క్రెడిట్ స్కోర్ వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కూడా అందజేయాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. దీని ద్వారా కేవలం వినియోగదారులు మాత్రమే కాకుండా.. మనీ లెండర్స్ కూడా కస్టమర్స్ సిబిల్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా వేగంగా సిబిల్ స్కోర్ అందించడం వల్ల లోన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కస్టమర్స్ క్రెడిట్ ట్రాక్ గురించి బ్యాంకులు, సీఐసీలకు అప్ డేటెడ్ సమాచారం అందుతూ ఉంటుంది. ఇది మెరుగైన సేవలు అందించేందుకు.. పొందేందుకు వీలుగా ఉంటుంది. అలాగే బ్యాంకులు ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు అనే విషయంపై స్పష్టమై సమాచారం ఉంటుంది. మరి.. సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.