iDreamPost
android-app
ios-app

RBI గుడ్‌న్యూస్‌.. అకౌంట్లో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా ఆ పని చేయొచ్చు

  • Published May 15, 2024 | 2:10 PM Updated Updated May 15, 2024 | 2:10 PM

బ్యాంకు ఖాతా నిర్వహణకు సంబంధించిన ఆర్బీఐ కొత్త రూల్‌ అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. ఖాతాలో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా సరే. ఆ పని చేయవచ్చని తెలిపింది. ఆ వివరాలు..

బ్యాంకు ఖాతా నిర్వహణకు సంబంధించిన ఆర్బీఐ కొత్త రూల్‌ అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. ఖాతాలో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా సరే. ఆ పని చేయవచ్చని తెలిపింది. ఆ వివరాలు..

  • Published May 15, 2024 | 2:10 PMUpdated May 15, 2024 | 2:10 PM
RBI గుడ్‌న్యూస్‌.. అకౌంట్లో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా ఆ పని చేయొచ్చు

బ్యాంకు లావాదేవీల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక నేటి కాలంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ప్రతి దానికి డిజిటిల్‌ చెల్లింపులే చేస్తున్నాం. బ్యాంకుకు వెళ్లి.. నిర్వహించే లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. అయితే బ్యాంకింగ్‌ రంగంలో ఎంత టెన్నాలజీ అందుబాటులోకి వచ్చినా కొన్ని రూల్స్‌ మాత్రం అస్సలు మారవు. ఇక నేటి కాలంలో చాలా మందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలున్నాయి. దాంతో అకౌంట్లో మినిమం బ్యాలెన్స్‌ మెయిన్‌టేన్‌ చేయడం చాలా కష్టం అవుతోంది. దాంతో చాలా సందర్భాల్లో మైనస్‌ బ్యాలెన్స్‌లోకి వెళ్తుంది. దాన్ని పట్టించుకోకపోతే.. అది మరింత పెరుగుతుంది. దాంతో చాలా మంది అకౌంట్‌లో మైనస్‌ బ్యాలెన్స్‌ చూడగానే.. వెంటనే అకౌంట్‌ క్లోజ్‌ చేస్తారు. అయితే మైనస్‌ బ్యాలెన్స్‌ క్లియర్‌ చేసిన తర్వాతే అకౌంట్‌ క్లోజ్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ ఎప్పటికప్పుడు.. నియమనిబంధంలను మారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మైనస్‌ బ్యాలెన్స్‌, మినిమం బ్యాలెన్స్‌కు సంబంధించి కొత్త రూల్స్‌ని తీసుకువచ్చింది. ఇకపై అకౌంట్‌లో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా సరే.. మీరు ఖాతాను క్లోజ్‌ చేయవచ్చు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై బ్యాంకులు మైనస్‌ మొత్తాన్ని చెల్లించమని కోరలేవు. ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్‌ ప్రకారం.. మీ బ్యాంక్‌ ఖాతాలో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నప్పటికి.. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించే పని లేకుండా.. మీ బ్యాంక్‌ ఖాతాను మూసివేయవచ్చు. ఆర్బీఐ నిర్ణయంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్బీఐ కొత్త రూల్స్‌ ప్రకారం.. అకౌంట్‌లో మైనస్‌ బ్యాలెన్స్‌ ఉన్నా.. రూపాయి చెల్లించే అవసరం లేకుండా.. ఖాతాను క్లోజ్‌ చేయవచ్చు. ఆ సమయంలో బ్యాంకులు మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోవు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఒకవేళ బ్యాంకులు మీ నుంచి డబ్బులు వసూలు చేస్తే.. bankingombudsman.rbi.org.inకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయాలి. అప్పుడు ఆర్బీఐ సదరు బ్యాంక్‌ మీద చర్యలు తీసుకుంటుంది. ఈ కొత్త రూల్‌ వల్ల అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదు. దీని వల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది.