Dharani
RBI New Rule-CIBIL Report, Bank Loans: బ్యాంకు లోన్లు తీసుకోవాలనే వారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
RBI New Rule-CIBIL Report, Bank Loans: బ్యాంకు లోన్లు తీసుకోవాలనే వారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో బ్యాంకు లోన్లు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగం అయ్యింది. వ్యక్తిగత అవసరాలు, పిల్లల భవిష్యత్తు, వాహనాలు.. ఇతర అవసరాల కోసం లోన్లు తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు లోన్ రావాలంటే.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద అమౌంట్ లోన్ కావాలన్నా.. ఆన్లైన్లోనే ప్రాసెస్ పూర్తి అవుతుంది. బ్యాంకు వారు అడిగిన వివరాలన్నింటిని ఇస్తే.. నిమిషాల వ్యవధిలోనే మీ ఖాతాలో లోన్ అమౌంట్ జమ అమువుతుంది. అయితే ఇప్పటికి కూడా లోన్ పొందాలనుకునే వారు ప్రధానంగా ఎదుర్కునే సమస్య.. సిబిల్ స్కోర్. దీనికి సంబంధించి తాజాగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లోన్లు పొందడం మరింత సులభం కానుంది. ఆ వివరాలు..
బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే ప్రధానంగా చూసే అంశం సిబిల్ స్కోర్. ఇది సరిగా లేకపోతే లోన్ రిజెక్ట్ అవుతుంది కూడా. ఈ క్రమంలో తాజాగా ఆర్బీఐ సిబిల్ రిపోర్ట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును అప్డేట్ చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది
ఈ నిబంధనతో వెంటనే రుణం కావాలనుకునే వారికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పొచ్చు. గతంలో బ్యాంకులు సహా ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు 30 రోజులకోసారి క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు దానిని 15 రోజులకు కుదిస్తూ.. ఆర్బీఐ గవర్నర్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం తర్వాత ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతానికి బ్యాంకులు నెలకోసారి సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలకు కస్టమర్ల క్రెడిట్ నివేదిక ఇవ్వాలి. ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం మార్చింది. తప్పనిసరిగా ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్ చేయాల్సిందిగా కోరింది. అత్యవసరంగా లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే.. బ్యాంకులు కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును చూసి లోన్లు మంజూరు చేస్తాయన్న సంగతి తెలిసిందే.
లోన్ ఇవ్వడానికి ముందు బ్యాంకులు వారి క్రెడిట్ అర్హతను అంచనా వేస్తాయి. ఇందుకోసం బ్యాంకులు క్రెడిట్ రిపోర్ట్ పరిగణనలోకి తీసుకుంటాయి. ఇందుకు సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఉదాహరణకు సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉన్నవారికి బ్యాంకులు త్వరగా లోన్లు ఇస్తాయి. పైగా వడ్డీ రేటు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ ఎవరికైతే సిబిల్ స్కోర్ 550 తక్కువ ఉంటే.. వారికి లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవు. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ పరిగణనలోకి తీసుకొని వెనుకడుగు వేస్తాయి. లోన్ ఒకవేళ ఇచ్చినా వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది.