iDreamPost
android-app
ios-app

గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యూజర్లకు శుభవార్త! ఇకపై..

  • Author Soma Sekhar Updated - 11:48 AM, Fri - 25 August 23
  • Author Soma Sekhar Updated - 11:48 AM, Fri - 25 August 23
గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యూజర్లకు శుభవార్త! ఇకపై..

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ పని అయినా మన అరచేతిలో ఉన్న ఫోన్ నుంచే చేసుకునే రోజులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు సైతం.. బ్యాంక్ కు వెళ్లకుండా ఇంట్లో నుంచే చేసుకుంటున్నాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్ యాప్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే డిజిటల్ సేవలను మరింతగా విస్తరించేందుకు RBI చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే యూపీఐ లైట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

యూపీఐ ప్లాట్ ఫామ్ పై చిన్న తక్కువ మెుత్తంలో చెల్లింపులను వేగంగా చేసేందుకు 2022 సెప్టెంబర్ లో యూపీఐ లైట్ ను ప్రవేశపెట్టింది ఆర్బీఐ. దీని ద్వారా ఇంటర్నెంట్ తక్కువగా ఉండే ప్రాంతాలు, అలాగే అసలు నెట్ ఉండని ప్రాంతాల్లో కూడా రిటైల్ డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్ యాప్ లలో యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ అడుగులు వేసింది. అందులో భాగంగానే ప్రతి ఆఫ్ లైన్ చెల్లింపు లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. దీని వల్ల బ్యాంకుల ప్రాసెసింగ్ వ్యవస్థలపై కూడా భారం తగ్గి.. లావాదేవీలు విఫలం అయ్యే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం దీనితో నెలకు కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.

ఇదికూడా చదవండి: జనాన్ని భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ సూత్రధారి అతడే..