SNP
RBI, YES Bank, Business News: అదనపు ఛార్జీలతో ఖాతాదారుల జేబులకు చిల్లుపెడుతున్న బ్యాంకుల పనిపడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా ఓ బ్యాంక్ చేసిన పనికి సీరియస్ అవుతూ.. జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
RBI, YES Bank, Business News: అదనపు ఛార్జీలతో ఖాతాదారుల జేబులకు చిల్లుపెడుతున్న బ్యాంకుల పనిపడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా ఓ బ్యాంక్ చేసిన పనికి సీరియస్ అవుతూ.. జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లంటూ పెద్దగా లేరు. దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి. అయితే.. ఈ బ్యాంక్ అకౌంట్ల నుంచి అదనపు ఛార్జీల పేరుతో కొన్ని బ్యాంకులు ఖాతాదారులను వేధిస్తూ ఉంటాయి. అలా ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వేసే బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్బీఐ.. ఎస్ బ్యాంక్‌కు ఏకంగా రూ.91 లక్షల జరిమానా విధించింది.
జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అంకౌట్లు ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని సమాచారం. అందుకే ఆర్బీఐ అంత భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనలను 2014లో తీసుకొచ్చింది ఆర్బీఐ.
ఇదే విషయంలో మరో బ్యాంక్‌కు కూడా ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది ఆర్బీఐ. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ లోన్స్ మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు ఆర్బీఐ ఈ కోటి రుపాయాల జరిమానా విధించింది. ఇలా బ్యాంకులు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు పసిగట్టి.. ఆర్బీఐ వాటికి జరిమానాలు విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 RBI fined Yes Bank ₹91 lakh for non-compliance with customer service and unauthorized operations, and ICICI Bank ₹1 crore for violating loan and advance restrictions.
[Current affairs, Govt. exams, 2024, Knowledge & facts] pic.twitter.com/66GrviPZOS
— Current Affairs by Testbook (@Testbook_CA) May 29, 2024