iDreamPost
android-app
ios-app

ముత్తూట్‌, మణప్పురంలో గోల్డ్‌ తీసుకుంటున్నారా.. RBI కీలక ఆదేశాలు.. ఇకపై రూ.20 వేలు మించితే

  • Published May 09, 2024 | 3:00 PM Updated Updated May 09, 2024 | 3:10 PM

ముత్తూట్‌, మణప్పురం వంటి సంస్థల్లో బంగారం లోన్‌ తీసుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్‌ వార్త. దీనిపై ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

ముత్తూట్‌, మణప్పురం వంటి సంస్థల్లో బంగారం లోన్‌ తీసుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్‌ వార్త. దీనిపై ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published May 09, 2024 | 3:00 PMUpdated May 09, 2024 | 3:10 PM
ముత్తూట్‌, మణప్పురంలో గోల్డ్‌ తీసుకుంటున్నారా.. RBI కీలక ఆదేశాలు.. ఇకపై రూ.20 వేలు మించితే

భారతీయులకు బంగారం అంటే అమితమైన మోజు. మన దగ్గర గోల్డ్‌ అంటే ఆభరణాలు మాత్రమే కాక.. అత్యవసర సమయంలో పెట్టుబడిగా కూడా పనికి వస్తుంది. చేతిలో రూపాయి లేనప్పుడు.. ఒంటి మీద ఉన్న బంగారమే మనల్ని ఆదుకుంటుంది. గోల్డ్‌ తీసుకెళ్లి బ్యాంకులు, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటాం. అయితే బంగారం మీద లోన్‌ ఇచ్చే అంశంలో బ్యాంకుల కన్నా ప్రైవేట్‌ సంస్థలే కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తాయి. అయితే ఇంట్రెస్ట్‌ రేట్‌ కూడా భారీగానే ఉంటుంది. పైగా ప్రతి నెలా వడ్డీ కట్టాలి. లేట్‌ అయితే ఛార్జీలు పెరుగుతాయి. అన్నింటికి తోడు నిర్ణీత కాలం లోపు బంగారాన్ని విడిపించుకోకపోతే వేలం వేస్తారు. ఇక నేటి కాలంలో చాలా మంది బ్యాంకుల్లో కన్నా ముత్తూట్‌, మణప్పురంలోనే గోల్డ్‌ లోన్స్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఈ క్రమంలో ఆర్బీఐ వీటికి కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు..

ముత్తూట్‌, మణప్పురం వంటి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు మంజూరు చేసే బంగారం లోన్‌కు సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఆయా సంస్థలు గోల్డ్‌పై రూ.20 వేలకు మించి నగదును కస్టమర్లకు ఇవ్వకూడదు. అంటే రూ.20 వేలకు మించి గోల్డ్‌ లోన్ నగదును చేతికి అందించకూడదని ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలిచ్చింది. రూ.20 వేల లిమిట్ దాటినట్లయితే ఆ లోన్ అమౌంట్‌ను నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారానే ట్రాన్స్‌ఫర్ చేయాలని స్పష్టం చేసింది. అంటే మీరు ఇక రూ.20 వేలకు మించి గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆదాయపు పన్ను శాఖకు అధిక మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్ల వివరాలు వెళ్తాయని గుర్తుంచుకోవాలి.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్ఎస్ రూల్స్ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ఓ అడ్వైజరీ జారీ చేసింది. ఈ నియమాల ప్రకారం వ్యక్తులు గోల్డ్ లోన్ అమౌంట్ రూ.20 వేలకు మించి నగదు రూపంలో తీసుకోవడానికి లేదు. ముత్తూట్, మణప్పురం వంటి నాన్ బ్యాంకింగ్ సంస్థలన్నీ గోల్డ్ లోన్ ఇవ్వడంలో ఈ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అలాగే లోన్ తీసుకునే వారు సైతం ఈ నిబంధనలను గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

ఆర్బీఐ తాజా నిర్ణయంపై ముత్తూట్‌, మణప్పురం సంస్థలు స్పందిస్తూ.. ఈ నిర్ణయం తమ వ్యాపారాల మీద ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నాయి. ఈ సందర్భంగా ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ రూల్స్ అనేవి అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తిస్తాయన్నారు. రూ.20 వేలకు మించి క్యాష్ రూపంలో ఇవ్వద్దని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పిందని.. అయితే, ఇది తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఎందుకంటే తమ కస్టమర్లకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ఇప్పటికే చాలా వరకు రియల్ టైమ్ ట్రాన్స్‌ఫర్ ద్వారానే తాము లోన్స్ ముంజూరు చేస్తున్నట్లు గుర్తు చేశారు.