iDreamPost
android-app
ios-app

RBI కొత్త రూల్.. ఇకపై బ్యాంకు అకౌంట్ లేకపోయినా డబ్బులు ఖర్చు చేయొచ్చు!

  • Published Aug 10, 2024 | 6:00 AM Updated Updated Aug 10, 2024 | 7:31 AM

RBI-UPI Delegated Payments: యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీకు ఖాతా లేకపోయినా డబ్బులు ఖర్చు చేయవచ్చు. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వార్త చూసేయండి.

RBI-UPI Delegated Payments: యూపీఐ పేమెంట్స్ కి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీకు ఖాతా లేకపోయినా డబ్బులు ఖర్చు చేయవచ్చు. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వార్త చూసేయండి.

  • Published Aug 10, 2024 | 6:00 AMUpdated Aug 10, 2024 | 7:31 AM
RBI కొత్త రూల్.. ఇకపై బ్యాంకు అకౌంట్ లేకపోయినా డబ్బులు ఖర్చు చేయొచ్చు!

డిజిటల్ ఇండియాలో భాగంగా మన దేశంలో.. యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. వీధి వ్యాపారులు మొదలు బడా మాల్స్ వరకు.. ప్రతి చోటా ఈ యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం నగరాలు, పట్టణాలు అని మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ పేమెంట్స్ బాగానే జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ పరిధిని మరింత పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో యూపీఐ పేమంట్స్ తో పాటుగా ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా.. ఇక మీరు.. మీ ఫ్రెండ్స్ డబ్బులను ఈజీగా వాడుకోవచ్చు. అదేలానో తెలియాలంటే.. ఇది చదవండి.

యూపీఐ పేమెంట్లను మరింత ప్రజాకర్షకంగా తీర్చేదిద్దడమే కాక.. ఎక్కువ మంది వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం కోసం.. ఆర్బీఐ డెలిగేటెడ్ పేమెంట్స్ విధానాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఒక యూపీఐ వినియోగదారు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్ధేశిత పరమితి వరకూ యూపీఐ పేమెంట్స్ చేసేందుకు మరో వ్యక్తికి అధికారమివ్వవచ్చు. ఈ డెలిగేటెడ్ పేమెంట్స్ విధానం ద్వారా.. బ్యాంకు ఖాతా లేని వారు వారి బంధువులు, స్నేహితుల యూపీఐ ఖాతాను, పిల్లలు అయితే వారి తల్లిదండ్రుల యూపీఐ ఖాతాల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ప్రకటించాల్సి ఉంటుంది.

ఇది అమల్లోకి వస్తే.. ఒక కుటుంబంలోని సభ్యులు ఒకే యూపీఐతో లావాదేవీలు జరిపే వీలు కల్పిస్తుంది. దీని ద్వారా హాస్టల్లో ఉండే పిల్లలు.. వార్డెన్, ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలానే ఎవరైనా తమ బెస్ట్ ఫ్రెండ్ కు సాయం చేయాలని భావించి.. బ్యాంక్ ఖాతా లేక ఇబ్బంది పడుతుంటే.. వారికి ఈ డెలిగేటెడ్ పేమెంట్స్ విధానం ఎంతో మేలు చేయనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. మీకు బ్యాంక్ ఖాతా లేకపోయినా.. స్నేహితుల యూపీఐ అకౌంట్ ని వాడుకోవచ్చు అన్నమాట. తాజా సమావేశంలో ఆర్బీఐ యూపీఐ పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ. లక్ష పరిమితిని రూ. 5 లక్షల వరకూ పెంచింది. అయితే ఇది అందరికి కాదు. కేవలం ట్యాక్స్ చెల్లింపుల కోసమే. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నును యూపీఐ ద్వారా చెల్లించేందుకు వీలవుతుంది. అలాగే నకిలీ రుణ యాప్ ల నివారణకు కూడా ఆర్బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.