iDreamPost
android-app
ios-app

భారీగా తగ్గిన వెండి ధరలు.. స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే?

భారీగా తగ్గిన వెండి ధరలు.. స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?

మనదేశంలో బంగారం కొనుగోలు పట్ల ఎంత మొగ్గుచూపుతారో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడంతా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే సమయం. ఈ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. ఈ సమయంలో కొనుగోలు దారులతో బంగారం షాపులు కళకళలాడుతుటాయి. తగ్గిన ధరలతో బంగారం షాపులకు గిరాకీ పెరుగుతుంది. కొనుగోలుదారులకు కాస్త ఆర్థిక భారం తగ్గుతుంది. ఓరోజు పెరుగుతూ..ఓ రోజు తగ్గుతూ షాకిచ్చే బంగారం వెండి ధరలు నేడు నేల చూపులు చూస్తున్నాయి. నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇదే సమయంలో సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. 22క్యారెట్లు 10గ్రాముల పసిడి ధర రూ. 10 తగ్గింది. దీంతో నిన్న 58000 వేలు పలికిన గోల్డ్ ధర నేడు తగ్గిన ధరలతో రూ. 57,990 వద్ద అమ్ముడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరపై కూడా రూ. 10 తగ్గింది. తగ్గిన ధరతో నిన్న 63230 ఉన్న ధర నేడు రూ. 63220కి చేరి ట్రేడ్ అవుతోంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,140 వద్ద అమ్ముడవుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. ఏకంగా కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో నిన్న రూ. 76000వేలు పలికిన సిల్వర్ ధర నేడు రూ. 75000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కేజీ వెండి రూ. 1000 తగ్గి.. రూ. 73,500కి చేరింది. విజయవాడలో రూ. 75,000, చెన్నైలో రూ. 75,000, ముంబాయిలో రూ. 73,500, బెంగళూరులో రూ. 71,000 వద్ద సిల్వర్ ట్రేడ్ అవుతోంది.