iDreamPost

పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ బడ్జెట్ కారు.. ఇది మిడిల్ క్లాస్ ఇన్నోవా!

కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. కానీ, మిడిల్ క్లాస్ వాళ్లు కారు కొనాలి అంటే అంత తేలిక కాదు. బడ్జెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటి వారికి ఇది ఇన్నోవా కారుతో సమానం.

కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. కానీ, మిడిల్ క్లాస్ వాళ్లు కారు కొనాలి అంటే అంత తేలిక కాదు. బడ్జెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటి వారికి ఇది ఇన్నోవా కారుతో సమానం.

పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ బడ్జెట్ కారు.. ఇది మిడిల్ క్లాస్ ఇన్నోవా!

మిడిల్ క్లాస్ వాళ్లు కారు కొనాలి అంటే చాలానే ఆలోచిస్తారు. ఎందుకంటే మనం పెట్టే డబ్బుకు అది సెట్ అవుతుందా? మన అవసరాలకు తగ్గట్లు ఆ కారు ఉంటుందా? మంచి మైలేజ్ ఇస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ల కోసం ఒక మంచి బడ్జెట్ కారును తీసుకొచ్చాం. అది కూడా మామూలు కారు కాదు.. ఇది మధ్యతరగతి వాళ్లకు ఒక ఇన్నోవా కారు లాంటిది అంటారు. అయితే ధర మాత్రం కచ్చితంగా బడ్జెట్ లోనే ఉంటుంది. అది కూడా అదిరిపోయే మైలేజ్ ఇస్తుంది. ఇంక ధర, స్పెసిఫికేషన్స్, మైలేజ్, ఫీచర్స్ అన్నింటి గురించి తెలుసుకోవాలి అంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.

మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న కారు మారుతీ సుజుకీ ఈకో గురించి. అదేటిం ఈకో గురించి మాకు తెలుసు కదా అంటారా? ఎప్పుడో ఒకసారి కచ్చితంగా మారుతీ ఈకోలో ప్రయాణం చేసే ఉంటారు. ప్రస్తుతం మారుతీ ఈకో నుంచి 2023లో కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. ఈ కారు కాస్త ధర కూడా పెరిగింది. ఎంత ధర పెరిగినా కూడా ఇది కచ్చతంగా మిడిల్ క్లాస్ ఇన్నోవా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారు ధర ప్రస్తుతం రూ.5 లక్షల 27 వేల నుంచి రూ.6 లక్షల 74 వేల వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉంటోంది. ఇందులో మీకు అంబులెన్స్ వర్షన్ మాత్రం రూ.8 లక్షలకు పైగా ఎక్స్ షో రూమ్ ధర ఉంది. వినియోగదారులకు ఈకోలో 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్ ఉంటాయి. 5 సీటర్ తీసుకుంటే మంచి బూట్ స్పేస్ లభిస్తుంది. మీకు 5 సీటర్ తో 510 లీటర్స్ బూస్ స్పేస్ లభిస్తోంది. అలాగే 7సీటర్ అయితే బూట్ స్పేస్ ఉండదు. ఫ్యూయల్ విషయానికి వస్తే.. పెట్రోల్, సీఎన్జీ వర్షన్స్ ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ తో వస్తోంది. ఈ మారుతీ ఈకోలో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి.

ఈకో 5 సీటర్ స్టాండర్డ్, ఈకో 7 సీటర్ స్టాండర్డ్, ఈకో 5 సీటర్ ఏసీ, ఈకో 7 సీటర్ ఏసీ సీఎన్జీ అనే వేరియంట్స్ ఉన్నాయి. వేరింయట్ మారితే ధర కూడా పెరుగుతుంది. అలాగే ఫీచర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈకో ఇంజిన్ 1197 సీసీతో వస్తోంది. మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వర్షన్ లో లీటరుకు మీకు 19 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. సీఎన్జీలో మీకు 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని చెబుతున్నారు. ఇంక ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా మీకు ఫీచర్స్ ఉండవనే చెప్పాలి. మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ తో వస్తుంది. పైగా కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్ కూడా ఉండవు. ఫాగ్ ల్యాంప్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కూడా సెపరేట్ గా ఏర్పాటు చేయించుకోవాల్సి వస్తుంది.

సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ లో డ్రమ్, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ వార్నింగ్, స్పీడ్ అలర్ట్, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గతంలో అయితే ఈకోకి గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ 0 స్టార్స్ వచ్చాయి. అప్పుడు ఈ మినీ వ్యాన్ కి ఎయిర్ బ్యాగ్స్ లేవు. కానీ, ఇప్పుడు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ తో ఈకో వస్తోంది. దీనిని ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ల ఇన్నోవా అని ఎందుకు అంటున్నాం అంటే.. స్పేస్, కంఫర్ట్, ప్యాసింజర్ కౌంట్ పరంగా ఇది ఇన్నోవాకు ఏమాత్రం తీసిపోదు. మధ్యతరగతి వాళ్లు ఇన్నోవా కొనాలి అంటే రూ.25 లక్షల నుంచి 35 లక్షలు వరకు పెట్టుకోవాలి. కానీ, ఈకో మాత్రం మీకు కేవలం రూ.6 లక్షల్లోనే దొరుకుతోంది. ఏడుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా ఎంతో హ్యాపీగా ఈకోలో ట్రావెల్ చేయచ్చు. మరి.. ఈకో కారు మీరు వాడుతుంటే మీ ఎక్స్ పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఈకో ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మీరు కొనాలి అనుకుంటున్నారా? అనే విషయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి