iDreamPost
android-app
ios-app

Post Office Schemes Vs Bank FDs: మీ డబ్బుని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు?

  • Published Oct 30, 2024 | 11:06 AM Updated Updated Oct 30, 2024 | 11:06 AM

Post Office Schemes Vs Bank FDs: సంపాదించిన డబ్బుని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా అని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి రిస్క్ లేకుండా కొన్ని మార్గాలు ఉన్నాయి.

Post Office Schemes Vs Bank FDs: సంపాదించిన డబ్బుని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా అని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి రిస్క్ లేకుండా కొన్ని మార్గాలు ఉన్నాయి.

Post Office Schemes Vs Bank FDs: మీ డబ్బుని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందుతారు?

సంపాదించిన డబ్బులను ఎక్కువ లాభాలు వచ్చే మార్గాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల పొదుపు చేశామంటే నష్టపోతాము. చాలా మంది కూడా రిస్క్ లేకుండా ఎక్కువ రాబడి రావాలనుకుంటారు. అయితే, సాధారణంగానే రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల్లోనే ఎక్కువ లాభాలు వస్తుంటాయి. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్స్ డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి సురక్షితమైన మార్గాలు. ఇవి మీకు కొన్ని మంచి ఆప్షన్స్ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంక్ లలో ఫిక్సెడ్ డిపాజిట్లపై ఎక్కువ లాభాలు వస్తాయి. ఇక పోస్ట్ ఆఫీసులో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. పెద్దగా రిస్క్ అనేది లేకుండా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. అయితే కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎందులో ఇన్వెస్ట్ చేయాలా? అని చాలా మంది కూడా తేల్చుకోలేని స్థితిలో ఉంటారు? ఇక ఈ రెండింటిలో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ రెండు మంచివే అయినా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే పోస్టాఫీసు పొదుపు పథకాలు మంచి రిటర్న్స్ అందిస్తున్నాయి. పైగా వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ వంటి స్కీమ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంటాయి. అయితే, ఈ వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్ల గురించి సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. మరోవైపు.. పెద్ద పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7 శాతం నుంచి 7.50 శాతం దాకా వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. అయితే, పోస్టాఫీసు పథకాలు, రిటైర్మెంట్ పథకాల్లో గరిష్ఠంగా 8 శాతానికిపైగా వడ్డీ వస్తుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మంచిది.

ఒక్కో స్కీమ్ కి ఒక్కో టెన్యూర్, లాకిన్ పీరియడ్ అనేవి ఉండాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కి 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. వీటిలో మీకు ఏది అనుగుణంగానే ఉంటే దానిలో పొదుపు చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో పోస్టాఫీసు పథకాల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు కావాల్సినప్పుడు డబ్బులు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇక పోస్టాఫీసు పథకాల్లో మంచి అంశం ఏంటంటే మీకు చాలా వరకు కూడా టాక్స్ బెనిఫిట్ అంటే.. పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, బ్యాంక్ డిపాజిట్లలో 5 ఏళ్ల పీరియడ్ గల ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లు మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తాయి. ఇదీ సంగతి. ఎలాంటి రిస్క్ లేకుండా హై రిటర్న్స్ కోరుకునేవారికి బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఎక్కువ లాభాలు ఇస్తాయి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.