Dharani
PM Vishwakarma Scheme: సామాన్యులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చు. ఆ వివరాలు..
PM Vishwakarma Scheme: సామాన్యులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చు. ఆ వివరాలు..
Dharani
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ స్కీమ్ ద్వారా మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకే భారీ మొత్తం రుణం లభించనుంది. ఇంతకు ఇది ఏ స్కీమ్.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి.. వంటి పూర్తి వివరాలు మీ కోసం.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు, వారు ఆర్థికంగా పైకి వచ్చేలా ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ లో పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చేతి వృత్తులు చేసుకునే వారు, కళాకారలు తమ నైపుణ్యాలని మరింత మెరుగుపర్చుకుని.. ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం ఈ పథకం ధ్యేయం. దీని ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయనుంది. ఈ స్కీం కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో వెల్లడించారు.
దీనిలో భాగంగా కళాకారులు తమ నైపుణ్యాల్ని మరింత మెరుగుపర్చుకోవడం, టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ స్కీం కింద రుణాలు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా 5 శాతం వడ్డీ రాయితీతో రూ. లక్ష లోన్ ఇస్తారు. దీన్ని తీర్చేందుకు సుమారు 18 నెలల సమయం ఉంటుంది. చెప్పిన గడువులోగా లోన్ కడితే.. రెండో విడతలో రూ. 2 లక్షల లోన్ ఇస్తుంది. ఇలా మొత్తంగా రూ.3 లక్షలు లోన్ ఇవ్వనున్నారు.
ఈ పథకం కింద పలు కులవృత్తుల వారు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయూత అందిస్తుంది. 2023 నుంచి 2028 వరకు అంటే ఐదేళ్లు ఈ స్కీం అమల్లో ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో ఎలాంటి రుణ సదుపాయం పొందని వారికే ఇది వర్తిస్తుంది.
ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, రేషన్, పాన్ కార్డు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ వంటి పత్రాలు, సర్టిఫికెట్లు అవసరం. ఇక ఈ పథకానికి ఎంపికైన వారికి ముందుగా ప్రాథమిక నైపుణ్యం పెంపొందించుకునేందుకు 5-7 రోజుల పాటు.. అదే అధునాతన నైపుణ్యం కోసం అయితే 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాక శిక్షణ ఇచ్చే సమయంలో రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తారు. టూల్ కిట్ కోసం శిక్షణ పూర్తయ్యాక రూ. 15 వేలు సాయం ఇస్తారు.