iDreamPost
android-app
ios-app

LPG Cylinder: మోదీ గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ! మరో 9 నెలల పాటు..!

  • Published Jun 24, 2024 | 2:10 PM Updated Updated Jun 24, 2024 | 2:10 PM

సామాన్యులకు మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌పై అందిస్తోన్న సబ్సిడీ మొత్తానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

సామాన్యులకు మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. గ్యాస్‌ సిలిండర్‌పై అందిస్తోన్న సబ్సిడీ మొత్తానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 2:10 PMUpdated Jun 24, 2024 | 2:10 PM
LPG Cylinder: మోదీ గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ! మరో 9 నెలల పాటు..!

ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. గతేడాది రాఖీ పండుగ సందర్భంగా ఒకసారి, మళ్లీ ఈ ఏడాది మహిళా దినోతవ్సం నాడు మరో సారి.. ఇలా రెండు పర్యాయాల్లో కలిపి.. నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్యాస్‌ సిలిండర్‌ ధర మీద 300 రూపాయలు తగ్గించింది. అయితే ఎన్నికల తర్వాత ఈ సబ్సిడీని ఎత్తివేస్తారని అందరూ భావించారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఎన్డీఏ కూటమికి సరైన మెజారిటీ రాలేదు. బోటాబోటి సీట్లతో అధికారంలోకి వచ్చింది. దాంతో జనాల్లో తన గ్రాఫ్‌ పడిపోకుండా చూడటం కోసం మోదీ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా రానున్న బడ్జెట్‌లో కిసాన్‌ యోజన సాయం 8 వేల రూపాయలకు పెంచుతారనే టాక్‌ వినిపిస్తుండగా.. ఇక తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ మీద ఇచ్చిన సబ్సిడీని మరి కొంత కాలం పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఉజ్వల యోజన సిలిండర్లపై 300 రూపాయల సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాయితీని.. వచ్చే ఏడాది అనగా 2025, మార్చి చివర వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతో పాటు 5 కేజీల సిలిండర్‌ ధరపైన కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక 2025, మార్చి తర్వాత నుంచి సబ్సిడీ ఉంచాలా.. కొనసాగించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్‌ సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అలానే పీఎం ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే 12 సిలిండర్ల మీద ఈ సబ్సిడీని అందిస్తుంది. కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ మీద అందించే 300 రూపాయల సబ్సిడీ వల్ల పేద, మధ్య తరగతి వాళ్లకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ క్రమంలో కేంద్రం మరో 9 నెలల పాటు సబ్సిడీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అనగా 2025, మార్చి వరకు ఈ 300 రూపాయల సబ్సిడీతో గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయవచ్చు.

పేదలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 ప్రధాన మంత్రి ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా సిలిండర్‌తో పాటు గ్యాస్‌ స్టవ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు ఉజ్వల స్కీమ్‌ సిలిండర్లు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.